ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారికి గుడ్ న్యూస్.. తక్కువ ధరకే మీకిష్టమైన వస్తువులు

దీపావళి పండుగ( Diwali festival ) అందరికీ ఎంతో ప్రత్యేకం.దేశవ్యాప్తంగా కులమతాలతో సంబంధం లేకుండా అంతా సంతోషంగా జరుపుకునే పండుగ ఇది.

 Good News For Online Shoppers Your Favorite Items At Low Prices, Online Business-TeluguStop.com

ఈ పర్వదినాన ప్రజల సంతోషం రెట్టింపు చేసేందుకు అమెజాన్ సంస్థ ముందుకు వచ్చింది.‘ధంతేరాస్ స్టోర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

తద్వారా ప్రజలు తమకు నచ్చిన వస్తువులను తక్కువ ధరకే కొనుగోలు చేసే సౌలభ్యం ఉంది.స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, హోమ్ డెకార్స్, గృహోపకరణాలు, కిరాణా సామాన్ల నుంచి చివరికి బంగారు లేదా వెండి నాణేలు, డిజిటల్ గోల్డ్ సైతం కొనుగోలు చేయొచ్చు.

సోనీ, కెంట్ హెల్త్ కేర్ ప్రొడక్టులు, గివా, డబ్ల్యుహెచ్‌పీ, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, కుందన్ బై జెయా, మెలోర్రా వంటి బ్రాండ్ల ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి.వీటిపై కొనుగోలు చేసే సమయంలో ఎస్‌బీఐ క్రెడిట్ డెబిట్ కార్డ్‌లు ( SBI Credit Debit Cards )ద్వారా చెల్లింపులు చేస్తే వాటిపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.

Telugu Latest, Offers, Ups-Latest News - Telugu

అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు( Amazon Prime Members ) కూడా ప్రత్యేక ఆఫర్ ఉంది.గోల్డ్ కాయిన్లను యూపీఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ.5000ల వరకు వరకు క్యాష్ బ్యాక్ పొందే వీలుంది.ప్రైమ్ మెంబర్‌షిప్ లేకుంటే కూడా ఆఫర్ ఉంది.అలాంటి వారు గరిష్టంగా రూ.3000ల క్యాష్ బ్యాక్ పొందొచ్చు.ఇక ధన్‌తేరాస్ స్టోర్ ద్వారా ఎన్నో ప్రొడక్టులపై భారీ ఆఫర్లు ఉన్నాయి.24 క్యారెట్లతో కూడిన 2 గ్రాముల గోల్డ్ లక్ష్మీ లాకెట్ రూ.13,200లకు డబ్ల్యుహెచ్‌పీ జ్యువెల్లర్స్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.24 క్యారెట్లతో కూడిన 10 గ్రాముల బంగారం బార్‌ను రూ.65,422కి కొనుగోలు చేయొచ్చు.ఇవే కాకుండా కిరాణా సామాన్లు, ఇంటికి అవసరమైన గృహోపకరణాలు కూడా అతి తక్కువ ధరకే అమెజాన్‌లో ధంతేరాస్ స్టోర్‌ ద్వారా పొందొచ్చు.

ప్రస్తుతం దీపావళి కావడంతో పూజా సామగ్రి, దీపాలను, క్యాండిల్స్‌ను తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి.వంట సామగ్రి కూడా అందుబాటు ధరలోనే ఉన్నాయి.ఇంకెందుకు ఆలస్యం.ఇప్పుడే మీకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube