కాంగ్రెస్ లో కాక రేపుతున్న రెబల్స్ !

తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) లో గ్రూపు రాజకీయాలు సర్వసాధారణమే.అయితే కీలకమైన ఎన్నికల సమయంలో ఆ పార్టీ నాయకులంతా సమిష్టిగా పార్టీ విజయానికి కృషి చేస్తున్నట్లుగా కనిపించడం , అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన తరువాత టికెట్ ఆశిస్తున్న నేతలు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇతర పార్టీల్లో కొంతమంది చేరగా,  మిగిలిన నాయకులు మాత్రం తమకు టిక్కెట్ దక్కకపోయినా,  రెబెల్ గా పోటీ చేసి తమ సత్తా చూపిస్తామంటూ బహిరంగంగానే సవాళ్లు విసురుతున్నారు అసంతృప్త నేతలు రెబల్స్ గా పోటీ చేయకుండా కాంగ్రెస్ పెద్దలు బుజ్జగింపులకు దిగినా, అసంతృప్తులు మాత్రం ససే మీరా అనడంతో వారి కారణంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపు పై తీవ్ర ప్రభావం ఉంటుందని , రాజకీయ ప్రత్యర్థులకు అది మేలు చేకూరుతుందనే ఆందోళన తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొంది.

 Congress Rebels Fight For Narsapur Tiket Details, Telangana Congress, Bjp, Br-TeluguStop.com
Telugu Aavula Raji, Anji, Brsmla, Brs, Gali Anilkumar, Narsapur Tiket, Sunitha L

నర్సాపూర్ కాంగ్రెస్ లోనూ ఇదే విధంగా  పరిస్థితి తయారయింది.ఆవుల రాజిరెడ్డికి పార్టీ టికెట్ కేటాయించడంతో మిగిలిన ముగ్గురు నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.మొన్నటి వరకు ఆవుల రాజిరెడ్డి( Aavula Rajireddy ) , గాలి అనిల్ కుమార్ , అంజిరెడ్డి , రఘువీరారెడ్డి నలుగురు నర్సాపూర్ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నించారు.చివరికి టికెట్ ఆవుల రాజిరెడ్డికి దక్కింది .దీంతో అభ్యర్థిని మార్చాలని,  లేదంటే తమలో ఒకరు రెబల్ గా పోటీ చేస్తామని ముగ్గురు నేతలు అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు.దీంతో ఈ నియోజకవర్గంలో వర్గ పోరు గెలుపు అవకాశాలను దెబ్బతీస్తాయనే ఆందోళన నెలకొంది.

అలాగే బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి,  బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డిలు నియోజకవర్గంలో కలిసి పనిచేస్తున్నారు కానీ కాంగ్రెస్ లో మాత్రం ఆ పరిస్థితి లేకపోవడంతో ఈ నియోజకవర్గంలో గెలుపు పై కాంగ్రెస్ టెన్షన్ పడుతోంది.

Telugu Aavula Raji, Anji, Brsmla, Brs, Gali Anilkumar, Narsapur Tiket, Sunitha L

 ఇదే కాకుండా చాలా నియోజకవర్గాల్లో టికెట్ దక్కిన వారు రెబల్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతుండడంతో,  రెబల్స్ అందరినీ బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన నామినేటెడ్ పదవులు ఇస్తామని నచ్చజెప్పి ప్రయత్నం చేస్తున్నాను.రెబెల్ గా పోటీ చేసే విషయంలో కొంతమంది బయటపడుతున్న నామినేషన్ల ప్రక్రియ మొదలైన తరువాత చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తులు బయటకు వస్తారని,  వారిని బుజ్జగించి నామినేషన్ విత్ డ్రా చేయించుకోవడం ఎలా అనే విషయం పైన కాంగ్రెస్ పెద్దలు దృష్టి సారించారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube