బైక్ మైలేజ్ ఇవ్వడంలేదా.. ఈ టిప్స్ తో సూపర్ మైలేజీ పెంచుకోండిలా..!

ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్( Petrol ) రేట్లు ఆకాశాన్ని అంటుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో పెట్రోల్ తో నడిచే ద్విచక్ర వాహనాలు నడిపే వారికి మైలేజ్ అనేది అతిపెద్ద సమస్యగా మారిపోయింది.

 Bike Is Not Giving Mileage Increase Super Mileage With These Tips , Bike Mileag-TeluguStop.com

సాధారణంగా బైక్ నడిపే వారందరూ ఎక్కువగా మధ్యతరగతి వారే ఉంటారు.బైక్ మైలేజ్ ఇవ్వకపోతే.

పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా బైక్ పై ప్రయాణించడం కష్టంగా మారింది.సాధారణ మధ్యతరగతి ప్రజలు బైక్ కొనే ముందు అడిగే మొదటి ప్రశ్న బైక్ మైలేజ్ ఎంత ఇస్తుంది అని.అలాంటి వారు బైక్ మైలేజ్ పై దృష్టి పెడితే ఇంధనం ఆదా చేయవచ్చు.బైక్ కొనుగోలు చేశాక కాల lక్రమేణా బైక్ మైలేజ్ తగ్గడం సహజమే.

ఎందుకంటే.బైక్ మెయింటెనెన్స్ లో లోపాలు జరగడం వల్లే.

ఈ చిట్కాలు పాటిస్తే బైక్ మైలేజ్ ఖచ్చితంగా పెంచుకోవచ్చు.అవి ఏమిటో చూద్దాం.

బైక్ రెగ్యులర్ సర్వీసింగ్:

బైక్ ను క్రమం తప్పకుండా ప్రతి 2000 లేదా 2500 కిలోమీటర్లకు ఒకసారి సర్వీసింగ్( Bike Servicing ) చేయాలి.ముఖ్యంగా ఇంజిన్ ఆయిల్ నాణ్యమైనది వాడాలి.

చిన్నచిన్న మరమ్మతులను ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు చేయించుకోవాలి.బైక్ లో ఏ చిన్న శబ్దం వచ్చిన వెంటనే ఆ సమస్యను గుర్తించి రిపేరు చేయించాలి.

Telugu Bike, Bike Mileage, Engine Oil, Gear, Mileage, Petrol-Technology Telugu

బైక్ టైర్లలో గాలి:

బైక్ టైర్లలో గాలి తక్కువగా ఉంటే పెట్రోల్ ఎక్కువ ఖర్చు అవుతుంది.కాస్త దూర ప్రయాణం చేసేటప్పుడు కచ్చితంగా బైక్ టైర్లలో గాలిని చెక్ చేసుకోవాలి.

Telugu Bike, Bike Mileage, Engine Oil, Gear, Mileage, Petrol-Technology Telugu

బైక్ ను సరైన గేర్ లో నడపడం:

బైక్ ను సరైన గేర్( Gear )నడిపితే ఇంజన్ సమర్థవంతంగా పనిచేస్తుంది.ఇంజన్ సమర్థవంతంగా పనిచేస్తే ఇంధనం వినియోగం తగ్గుతుంది.

స్పీడ్:

బైక్ పై అతి స్పీడ్ గా వెళ్లడం, అనవసరమైన బ్రేకింగ్ వల్ల ఇంధనం ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది.

బైక్ పరిశుభ్రత:

బైక్ పరిశుభ్రంగా ఉంటే ఇంజన్ కూడా పరిశుభ్రంగా ఉన్నట్టే. ఇది ఇంజన్ ను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.

Telugu Bike, Bike Mileage, Engine Oil, Gear, Mileage, Petrol-Technology Telugu

ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటే బైక్ మైలేజ్ మంచిగా పెరిగి ఎప్పుడు తగ్గకుండా ఉంటుంది.దీంతో అదనపు ఇంధనం ఖర్చు ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube