రాజన్న సిరిసిల్ల జిల్లా :రేపటి నుండి ప్రారంభమగు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్( Assembly Election Nomination ) పక్రియ సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆనంద్ కుమార్,అదనపు ఎస్పీ చంద్రయ్య పోలీస్ అధికారులతో క్షేత్ర స్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….రేపటి నుండి ప్రారంభమగు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్స్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్,కేంద్ర బలగాలతో పటిష్ట భద్రత,సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
నామినేషన్( Nomination ) ల దాఖలుకు అభ్యర్థితో పాటు 5 గురికి ( 1 +4) కు మాత్రమే అనుమతి ఉంటుందని,ఐదుగురు కంటే ఎక్కువ మందికి లోపలికి పర్మిషన్ లేదు.నామినేషన్ కేంద్రం నుంచి 100 మీటర్ల దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరం నుండి కేవలం 3 వాహనాలనే అనుమతిస్తామని చెప్పారు.ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీల( Political parties ) అభ్యర్థులు, ప్రతినిధులు సహకారం అందించాలన్నారు.
ఎస్పీ వెంట సిరిసిల్ల డిఎస్పీ ఉదయ్ రెడ్డి, టౌన్ సి.ఐ ఉపేందర్, ఎమ్మార్వో షరీఫ్ మోహినుద్దీన్ ఉన్నారు.