మెరుపు వేగంతో వెళ్తూ గేదెను ఢీ కొట్టిన కియాసెల్టోస్ కారు.. వీడియో వైరల్..

భారతీయ రోడ్లపై చాలా జాగ్రత్తగా వెళ్లాలి.ఎందుకంటే కుక్కలు, పశువులు రోడ్లపై సడన్‌గా వచ్చేస్తుంటాయి.

 Kiaseltos Car Hit A Buffalo While Going At Lightning Speed Video Viral , Kia Se-TeluguStop.com

ఈ విషయం తెలియక ఒక కియా సెల్టోస్ కారు( Kia Seltos car ) డ్రైవర్ మెరుపు వేగంతో రోడ్లపై వెళ్ళాడు.ఆ క్రమంలోనే గేదెను( buffalo ) ఢీ కొట్టాడు.

ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కర్నాటకలోని హైవేపై గంటకు 110 కిలోమీటర్ల వేగంతో కారు ఢీకొన్న దృశ్యాన్ని కారులోని డ్యాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ఆ వీడియో ప్రకారం, హై బీమ్ హెడ్ లైట్లు ఆన్ చేసి నాలుగు లేన్ల రహదారిపై కారు ప్రయాణిస్తోంది.ఇది ఇతర వాహనాలను అధిగమించి వేగంగా దూసుకెళ్లింది.

అకస్మాత్తుగా రోడ్డుపై గేదె కనిపించడంతో డ్రైవర్ బలంగా బ్రేక్ వేయడానికి ప్రయత్నించాడు.కానీ అది సాధ్యం కాలేదు.

కారు గేదెను చాలా వేగంగా ఢీ కొట్టింది.ఆపై కారు పల్టీలు కొడుతూ నుజ్జునుజ్జు అయింది.

ఢీకొన్న తర్వాత కారు తీవ్రంగా దెబ్బతినడంతో డాష్‌బోర్డ్ కెమెరా రికార్డింగ్ ఆగిపోయింది.క్రాష్ ధాటికి కియా సెల్టోస్ పైకప్పు, పిల్లర్ భాగం నుజ్జునుజ్జయింది.కారు యజమాని కుటుంబంతో కలిసి నేషనల్ హైవే 50పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది.ఘటన జరిగిన ప్రదేశం గురించి ఖచ్చితమైన సమాచారం లేదు.అదృష్టవశాత్తూ కారులో ఉన్న వారంతా సీటు బెల్టు పెట్టుకుని ప్రమాదం నుంచి బయటపడ్డారు.కారు ఢీకొన్న గేదె చనిపోయిందా లేదా బతికిందా అనే దానిపై సమాచారం లేదు.

ప్రమాదంలో జంతువు చనిపోయి లేదా గాయపడిన అవకాశం ఉంది.కియా సెల్టోస్‌కు ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు.

కొద్ది రోజుల క్రితం మరో కియా సెల్టోస్ కారు ట్రక్కును ఓవర్‌టేక్ చేస్తుండగా డివైడర్‌పై నుంచి దూకి ఆవును ఢీకొట్టింది.ఆ ఘటన కూడా డాష్‌ కెమెరాలో రికార్డయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube