రవితేజ జోరు చూసి యంగ్ హీరోలు అసూయ.. ఇదీ మాస్ రాజా అంటే?

మాస్ మహారాజా రవితేజ( Raviteja ) స్పీడ్ మరే హీరోకు కూడా ఉండదు అనే చెప్పాలి.ఈయన ముందు నుండి ఇదే స్పీడ్ తో వెళుతున్నారు.

 Mass Maharaja Ravi Teja Up Coming Movies, Tiger Nageswara Rao, Ravi Teja, Gopich-TeluguStop.com

ఒకానొక దశలో ఏడాదికి నాలుగు సినిమాలు కూడా రిలీజ్ చేసాడు.అంత తక్కువ సమయంలో హడావిడిగా పూర్తి చేసి రిలీజ్ చేయడంతో ఎక్కువ ప్లాప్స్ ఎదురయ్యాయి.

దీంతో కాస్త స్లో అయ్యాడు.అయితే క్రాక్, ధమాకా వంటి హిట్స్ పడడంతో మళ్ళీ జోష్ పెరిగింది.

దీంతో ఇంతకు ముందుగా ఈయన స్పీడ్ పెరిగింది.రవితేజ వంశీ దర్శకత్వంలో చేసిన టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageswar Rao ) దసరా కానుకగా రిలీజ్ అయ్యింది.

కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు చాలా దూరంలో ఉండడంతో ప్లాప్ దిశగా వెళుతుంది.

Telugu Eagle, Massmaharaja, Ravi Teja, Rtgm, Tigernageswara-Movie

మరి ఈ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా రవితేజ తన నెక్స్ట్ సినిమాలను పూర్తి చేస్తున్నారు.కార్తీక్ ఘట్టమనేని ( Karthik Gattamneni ) దర్శకత్వంలో చేస్తున్న ”ఈగల్” ( Eagle ) సినిమాను పూర్తి చేసి సంక్రాంతి రిలీజ్ కు రెడీగా ఉంచాడు.ఇక ఈ సినిమాను పూర్తి చేసాడో లేదో అప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసాడు.

రవితేజ గోపీచంద్ మలినేని కాంబో ( RT4GM ) మరోసారి అఫిషియల్ అయిన విషయం తెలిసిందే.గోపీచంద్ మలినేని( Gopichand Malineni )తో రవితేజ కొత్త మూవీ అప్పుడే మొదలు పెట్టడానికి సిద్ధం అయ్యారు.

ఐదు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.

Telugu Eagle, Massmaharaja, Ravi Teja, Rtgm, Tigernageswara-Movie

మైత్రి మూవీస్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తుండగా.థమన్ సంగీతం అందిస్తున్నట్టు కూడా ప్రకటించారు.ఈ కాంబో బ్లాక్ బస్టర్ కాంబో కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మొత్తానికి మాస్ రాజా స్పీడ్ చూసి యంగ్ హీరోలు కూడా అసూయ పడుతున్నారు.ఈ రేంజ్ లో స్పీడ్ గా సినిమాలను మరే హీరో చెయ్యడు అనేది అతియసోక్తి కాదేమో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube