తెలంగాణ ఎన్నికల రేసులో తాము వెనకబడ్డామని భావిస్తున్న కేంద్ర అధికార పార్టీ బిజెపి ( BJP )దూకుడు పెంచాలని నిర్ణయించింది.ఈనెల మూడో తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో, కాంగ్రెస్ , బీఆర్ఎస్ ( Congress BRS )లను దీటుగా ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది.
అసలు ఈ ఎన్నికల రేసులో ఎందుకు వెనకబడ్డాము అనే విషయం పైన విశ్లేషణ చేసుకుంటుంది .కరీంనగర్ ఎంపీ ,మాజీ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు బిజెపి అధిష్టానం నిర్ణయించుకుంది.బిజెపి అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఇటీవల కేంద్ర హోం మంత్రి ప్రకటించారు .ఈ మేరకు కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఉండడంతో సంజయ్ వర్గీయులు ఆనందం వ్యక్తం అవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా బండి సంజయ్ కు గట్టుపట్టు ఉండడం, ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేయడంలో సంజయ్ దిట్ట కావడం తోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్నికల ప్రచారం చేయించాలని, బిజెపి అగ్రనేతలు నిర్ణయించుకున్నారు .

కేసీఆర్ కు దీటుగా మాట్లాడగలిగిన నేతగా సంజయ్ ను బిజెపి అధిష్టానం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే సంజయ్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వీలుగా బిజెపి జాతీయ నాయకత్వం ఆయనకు హెలికాఫ్టర్ ను ప్రత్యేకంగా కేటాయించింది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఆయన సేవలను వినియోగించుకునే విధంగా ఎన్నికల ప్రచారం చేసేందుకు అనువుగా హెలికాప్టర్ ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది .సంజయ్ తో పాటు, కేంద్ర మంత్రి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి , ఈటెల రాజేందర్ వంటి వారిని ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది.బండి సంజయ్ ఈ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ఒకవైపు తన అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేపడుతూనే రాష్ట్రవ్యాప్తంగా హెలికాప్టర్ ద్వారా నియోజకవర్గంలో పర్యటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు .ఒకవైపు బండి సంజయ్,( Bandi Sanjay ) మరోవైపు కిషన్ రెడ్డి, ( Kishan Reddy )ఈటెల రాజేందర్ ( Etela Rajender )తోపాటు , కేంద్ర బిజెపి పెద్దలు ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వీలుగా బిజెపి అధిష్టానం మరో రెండు హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించింది.ఇది ఇలా ఉంటే
మొన్నటి వరకు బిజెపి, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ విమర్శలు చేయగా, రెండు రోజులుగా కేసీఆర్, మంత్రి కేటీఆర్ వంటి వారు బిజెపిని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోది సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని , కానీ తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నామని కెసిఆర్ చెబుతున్నారు.కేంద్రం తెలంగాణకు ఇచ్చింది తక్కువని, తీసుకుంది ఎక్కువ అని విమర్శలు చేస్తున్నారు.బిజెపి సరికొత్త వ్యూహాలతో బీఆర్ఎస్ , కాంగ్రెస్ లను ఎదుర్కునేందుకు సిద్ధమవుతోంది.
కేసిఆర్ పై పోటీకి ఈటల రాజేందర్ ను దింపింది.