యూపీలో పోలీసును నడి రోడ్డుపై చితకబాదిన నిరసనకారులు.. షాకింగ్ వీడియో వైరల్...

ఉత్తరప్రదేశ్‌లో ( Uttar Pradesh )సామాన్యులకు మాత్రమే కాదు పోలీసు అధికారులకు కూడా రక్షణ లేకుండా పోతోంది.తాజాగా మహోబా జిల్లాలో ఓ పోలీసు అధికారిపై హింసాత్మక దాడికి కొందరు పాల్పడ్డారు.

 Protesters Crushed A Policeman On The Road In Up Shocking Video Viral , Up Polic-TeluguStop.com

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.సోమవారం నాడు రికార్డ్ చేయబడిన ఈ వీడియోలో కోపంగా ఉన్న నిరసనకారుల గుంపు, యూపీ పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ రామ్ ( ram )అవతార్‌పై పిడికిలి, కర్రలతో దాడి చేయడం కనిపించింది.

సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా బస్సు ఢీకొని 13 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మహోబాలోని పన్వారీ( Panwari in Mahoba ) ప్రాంతంలో చోటుచేసుకుంది.బాలుడి కుటుంబీకులు, స్థానికులు అతడి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి బస్సు డ్రైవర్‌కు న్యాయం చేయాలని, నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.

పోలీసు అధికారి రామ్ అవతార్, అతని టీమ్‌ను రోడ్‌బ్లాక్‌ క్లియర్ చేయడానికి ఉన్నతాధికారులు పంపించారు, అయితే వారు బాధిత కుటుంబీకుల నుండి గట్టి ప్రతిఘటనను ఎదుర్కొన్నారు.పోలీసులు చులకనగా, అవినీతికి పాల్పడుతున్నారని ఆందోళనకారులు ఆరోపించారు.

వారు రామ్ అవతార్‌పై కర్రలు, రాళ్లతో దాడి చేయగా, అతని తోటి వచ్చిన మిగతా పోలీసులు అక్కడి నుండి పారిపోయారు.

సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, మహోబా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.గాయపడిన రామ్ అవతార్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.మహోబా పోలీస్ సూపరింటెండెంట్ అపర్ణ గుప్తా, రామ్ అవతార్‌పై దాడిని ఖండించారు.

గుర్తు తెలియని దుండగులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.నిందితులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

బాలుడి కుటుంబానికి న్యాయం, పరిహారం అందేలా పోలీసులు చూస్తారని ఆమె తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube