సినిమా అంటే కేవలం హీరో మాత్రమేనా.? హీరో డాన్సులు చేస్తాడు, ఫైట్లు చేస్తాడు, సినిమా మొత్తం ఉంటాడు.అయితే సినిమా లో ఒక హీరో ఉంటే సరిపోతుందా ? హీరోయిన్స్ ఉండరా ? హీరోతో సమానంగా హీరోయిన్స్ కి సినిమా లాభాల్లో కానీ, సినిమా సక్సెస్ లో కానీ వాటా లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది అని ఒప్పుకోవాల్సిందే.మరి హీరోతో సమానంగా సినిమా మొత్తం నటించి, హీరో కన్నా ఒక మెట్టు ఎక్కువగానే కష్టపడి 500 కోట్లకు పైగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టిన హీరోయిన్స్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.మరి వారెవరో ? వారు నటించినా సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అనుష్క

ఖచ్చితంగా ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు అనుష్కదే.( Anushka ) ఆమె బాహుబలి సినిమలతో( Baahubali ) సినిమాలో కీ రోల్ పోషించడం మాత్రమే కాదు ఈ సినిమాల విజయంలో కీలక పాత్ర కూడా అనుష్కకి దక్కింది.అందువల్ల ఈ సినిమా కలెక్షన్స్ లో కూడా ఆమె హస్తము ఖచ్చితంగా ఉంటుంది.
బాహుబలి సినిమాలు రెండు కూడా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సంగతి మనకు తెలిసిందే.ఈ చిత్రంలో అమే పోరాటపటిమ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుంది.
దీపికా పదుకునే

పటాన్( Pathan ) సినిమాలో దీపికా పదుకొనే( Deepika Padukone ) షారుక్ ఖాన్ తో సమానంగా యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తూనే మరోవైపు గ్లామర్ ను ఒలికించడంలో కూడా ఏమాత్రం వెనకాడ లేదు.ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ కి దుమ్ము దులిపినట్టు అయింది.ఈ సినిమా 1000 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది.
నయనతార

ఎలాగైతే దీపికా కు లక్కీ స్టార్ గా షారుక్ ఉన్నాడో నయన్ కి( Nayanthara ) కూడా 1000 కోట్ల సినిమాగా లో భాగాన్ని ఇచ్చాడు.వీరు కలిసి నటించిన జవాన్ సినిమా( Jawan ) బాలీవుడ్ లో మంచి విజయాన్ని సాధించడంతో పాటు నయన్ కి కూడా సూపర్ రికార్డ్ దక్కేలా చేసింది.
అమీషా పటేల్

సినిమా ఇండస్ట్రీలో అరకొర అవకాశాలు మాత్రమే దక్కించుకుంటున్న అమీషా పటేల్( Ameesha Patel ) కూడా ఈ లిస్టులో స్థానం సంపాదించుకోవడం చెప్పుకోదగ్గ విషయం.ఎందుకంటే ఆమె నటించిన గదర్ సినిమా( Gadar Movie ) అతిపెద్ద విజయాన్ని సాధించి ఆమెను 1000 కోట్ల హీరోయిన్ గా మార్చేసింది.
త్రిష

తాజాగా లియో చిత్రం తో త్రిష( Trisha ) కూడా ఈ లిస్ట్ లో చేరింది.గత 20 ఏళ్లుగా విరామం లేకుండా హీరోయిన్ గా నటిస్తున్న త్రిష కెరీర్ చరమాంకంలో ఉన్న ఈ టైం లో అమే 500 కోట్ల క్లబ్ లో చేరింది.







