విశాఖలోని రుషికొండలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు భవన నిర్మాణాలపై న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
నిబంధనల అతిక్రమణలు ఏ మేరకు ఉన్నాయో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఎంఓఎఫ్ఎఫ్ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది.ఈ క్రమంలోనే ఏం చర్యలు తీసుకున్నారో అన్న దానిపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం తెలిపింది.
రుషికొండపై అనుమతికి మించి తవ్వకాలు జరిపి ప్రభుత్వ భవనాల నిర్మాణాలు చేపట్టారని హైకోర్టు నియమంచిన కమిటీ నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కమిటీ నివేదికపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.