బాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలతో రాబోతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ”యానిమల్’‘( Animal Movie ) ఒకటి.ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆడియెన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియన్ ఆడియెన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే భారీ హోప్స్ పెంచేసుకున్న ఈ సినిమా అతి త్వరలోనే రిలీజ్ కానుంది.అయితే ఈ సినిమా గత కొద్దీ రోజుల నుండి ఏదొక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఇక తాజాగా ఈ సినిమా విషయంలో మరొక వార్త నిన్నటి నుండి ఓ రేంజ్ లో హల్చల్ చేస్తుంది.మరి దానిపై ఇప్పుడు క్లారిటీ తెలుస్తుంది.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) తెరకెక్కిస్తున్నాడు.

బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్( Ranbir Kapoor ) హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) హీరోయిన్ గా నటిస్తున్న ‘యానిమల్’ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది.ఈ మధ్య వచ్చిన ఫస్ట్ సింగిల్ తో ఈ సినిమాపై అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమా రన్ టైం గురించి షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.ఇది మూడున్నర గంటలు అనే వార్తలు రాగా ఇది అంత అబద్ధమే అని ఫైనల్ రన్ టైం ఇదే అంటూ క్లారిటీ తెలుస్తుంది.ఇది మొత్తంగా 3 గంటల 10 నిముషాలుగా కన్ఫర్మ్ చేసినట్టు బిటౌన్ వర్గాలు చెబుతున్నాయి.
చూడాలి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో.కాగా డిసెంబర్ 1న గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు హర్ష వర్ధన్ సంగీతం అందిస్తుండగా టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.







