ప్రపంచ కప్(World Cup ) లో పాల్గొనే పసికూన జట్లు సెమీఫైనల్ అర్హత సాధించలేవు కానీ సెమీఫైనల్ చేరే పెద్ద జట్ల ఫలితాలను తారుమారు చేయగలవు.ఒక్క మాటలో చెప్పాలంటే సెమీఫైనల్ చేరే నాలుగు జట్లను పసికూనలే సెలెక్ట్ చేస్తాయి.
ఇందులో ఎలాంటి అనుమానం లేదు.ప్రస్తుతం పసికూన ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా అదే చేస్తోంది.

ప్రపంచ కప్ 2023లో ఆఫ్ఘనిస్తాన్( Afghanistan ) పెద్ద విధ్వంసమే సృష్టిస్తోంది.డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు పాకిస్తాన్ కి కూడా ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా పుణె వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీలంక జట్టును ఆఫ్ఘనిస్తాన్ జట్టు చిత్తుగా ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీఫైనల్ చేరుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే.
సెమీస్ రేసులో ఉండే జట్లకు ఊహించని షాక్ లు అయితే ఇస్తోంది.ఆఫ్ఘనిస్తాన్ ఆడిన ఆరు మ్యాచ్లలో మూడు మ్యాచ్లలో విజయం సాధించింది.
ఇంకా నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లతో మ్యాచ్ ఆడాల్సి ఉంది.

ఆఫ్ఘనిస్తాన్ జట్టు దూకుడు చూస్తుంటే ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు( Australia )కు కూడా షాక్ ఇచ్చే అవకాశం ఉంది.నవంబర్ 7న ఆస్ట్రేలియా తో ఆఫ్గనిస్తాన్ తలపడనుంది.ఆఫ్ఘన్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఒకవేళ ఆస్ట్రేలియా కనుక ఆఫ్ఘన్ చేతిలో ఓడిపోతే ప్రపంచకప్ చరిత్రలోనే పెను సంచలనం అవుతుంది.ఈ టోర్నీలో పెద్దగా ఫామ్ లో లేని ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక లను ఓడించినంత ఈజీగా ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి పటిష్టమైన జట్లను ఓడించడం అంత ఆషామాషీ విషయం కాదు.
ఒకవేళ ఈ రెండు జట్లలో ఏదైనా ఒక జట్టు ఓడితే భారత్ మినహా సెమీస్ రేసులో ఉండే మిగతా జట్ల ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది.ప్రపంచ కప్ మరింత రసవత్తరంగా సాగాలంటే ఆఫ్ఘన్ మరిన్ని సంచలనాలు సృష్టించాల్సిందే.







