రాజన్న సిరిసిల్ల జిల్లా: యువత,రైతులు,పేద,బడుగు బలహీన వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని,జడ్పి చైర్మన్ రామన్నపేట గ్రామంలో దుర్గామాత యూత్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ అన్నాడు.రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలంలోని రామన్నపేట గ్రామంలో గడప గడపన కాంగ్రెస్ ఆరు గ్యారంటీల ప్రచార కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ పార్టీ కిషాన్ సెల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ ఫాష, రామన్నపేట కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఆది శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ యువత,రైతులు,బడుగు,పేద,బలహీన వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని,కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజల అబివృద్ది,సంక్షేమం జరిగుతుందని విశ్వసిస్తున్నారని అన్నాడు.
యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కలగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఈ రోజు కోనరావుపేట మండలం స్వయన రాజన్న సిరిసిల్లా జిల్లా బారాస జడ్పి చైర్మన్ గ్రామంలో దుర్గామాత యూత్ సభ్యులు 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారని,కాంగ్రెస్ పార్టీ వేములవాడ, తెలంగాణలో గెలవాలని యువత బలంగా కోరుకుంటున్నారని,మార్పు దిశగా కాంగ్రెస్ పార్టీ గెలుపుకై రామన్నపేట యువకుల పార్టీలో చేరి మద్దతు తెలిపినట్టు,నియోజకవర్గ యువత కాంగ్రెస్ పార్టీ గెలుపుకై పాటు పడాలని,కాంగ్రెస్ పార్టీతోనే యువకులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు వస్తాయని,మార్పు యువతతోనే మన వేములవాడ నియజకవర్గం నుండే మొదలు కావాలని యువతకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఓకే దఫా రైతుకు పంట రుణమాఫీ, మహిళలకు 5 వందలకు సిలెండర్, నెలకు 25 వందల రూపాయలు,ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నాడు.
చదువుకోవడనికి విద్యార్థులకు,యువతకు 5 లక్షల రూపాయలు,2 లక్షల ఉద్యోగా కల్పన,ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు,అడబిడ్డల పెళ్లికి 1 లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తామని అన్నాడు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆ మార్పు తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అనుకుంటున్నారని అన్నాడు.నాయకులు కోనరావుపేటను కోన సీమగా మార్చమని ఉపన్యాసాలు చెప్పడమే కానీ కోనరావుపేటలో ఎలాంటి అబివృద్ది జరగలేదని అన్నాడు.
గొప్పగా చెప్పుకునే మల్కాపేట రిజర్వాయర్,మిడ్ మానేరు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ పార్టీయే కట్టినదని,ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులే ఉన్నాయని,
మల్కాపేట రిజర్వాయర్ క్రిందా కాలువలు పూర్తి కాకుండానే వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పడం విడ్డురంగా ఉందని,జీవన్ రెడ్డి రోడ్డు,భవనాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూల వాగుపై నిర్మించిన బిడ్జీలు తప్ప 10 సంవత్సరాలలో ఒక్క బిడ్జి కూడా నిర్మించలేదని,భారీ వర్షాలకు అవి తెగి ప్రజా రవాణా కు తీవ్ర ఇబ్బంది కలిగిన పట్టించుకున్న పాపాన పోలేదని, స్వయన రామన్నపేట గ్రామం నుండి జిల్లా పరిష్యత్ అధ్యక్షురాలు ఉన్నప్పటికీ 5 ఏళ్లలో విద్యార్థులు స్కూల్,కాలేజికి,గ్రామస్తులు దవాఖానకు,అవసరాల నిమిత్తము జిల్లా కేంద్రానికి వెళ్లడానికి బస్సు సౌకర్యం కూడా కల్పించలేదని బారాస నాయకులు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని
చెప్పడానికే సరిపోతుందని,ఈ 10 సంవత్సరాలలో బారాస నాయకులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని ప్రజలకు గుర్తు చేశాడు.అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గంలో నేను నాలుగు సార్లు ఓడిపోయిన మీ కష్ట-సుఖలలో మీతోనే ఉన్నాను.
ఈ సారి మార్పు కోసం బిసి బిడ్డానైన నన్ను నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ వేములవాడ ఎమ్మెల్యేగా గెలిపించాలని,మీకు సేవ చేయడానికి అధికారం ఇవ్వాలని కోరాడు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు ఆగేష్,కార్యదర్శి తాళ్లపల్లి ప్రభాకర్, లక్ష్మారెడ్డి, లావణ్య,నవీన్,బండారి రమేష్, ప్రణయ్, నరేష్, గంగరాజు,గ్రామ యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.







