Tasty Teja: తేజ నామినేట్ చేస్తే ఇక ఇంటికి వెళ్లాల్సిందేనా ? 7గురిని పంపించేసావ్ గా ?

టేస్టీ తేజ ( Tasty Teja ) నామినేట్ చేస్తే ఇక ఇంటికి వెళ్ళవలసిందేనా అని అడిగితే ఖచ్చితంగా అవును అనే సమాధానం ప్రస్తుతం వినిపిస్తుంది.బిగ్ బాస్ తెలుగులో ఏడవ సీజన్ ప్రారంభమై ఇప్పటికే 8 వారాలు గడిచింది.

 Tasty Teja Nominations Are Eliminated From Bb-TeluguStop.com

వారానికి ఒకరు చొప్పున ఎనిమిది మంది ఇంటి ముఖం పట్టగా వైల్డ్ కార్డు ఎంట్రీలుగా ఐదుగురు మరోసారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.అలాగే రతిక సైతం ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్( Bigg Boss ) ఇంటికి తిరిగి వచ్చింది.

గతవారం డాన్స్ మాస్టర్ అయినటువంటి ఆట సందీప్( Aata Sandeep ) ఎలిమినేట్ అయి ఇంటి మొహం పట్టాడు.ఇప్పటివరకు జరిగిన ఎనిమిది ఎలిమినేషన్స్ చూసుకున్నట్లయితే టేస్ట్ ఈ తేజ నామినేట్ చేసిన ఏడుగురు ఎలిమినేట్ కావడం గమనించాల్సిన విషయం.

Telugu Aata Sandeep, Bigg Boss, Damini, Kiran Rathode, Pavani, Pooja, Rathika, S

టేస్టీ తేజ మొట్ట మొదటి వారం కిరణ్ రాథోడ్ ని( Kiran Rathode ) నామినేట్ చేయగా ఆమె ఎలిమినేట్ అయి వెళ్ళిపోయింది.ఇక రెండవ వారం షకీలా ఇంటి ముఖం పట్టినప్పటికీ ఆమెను నామినేట్ చేసిన వారిలో టేస్టీ తేజా లేడు.ఎందుకంటే షకీలా తో టేస్టీ తేజకు మంచి అనుబంధము ఉండేది.రెండు వారాలకే వారు మంచి స్నేహితులుగా మారారు.అందువల్ల ఆమెను నామినేట్ చేయలేదు.ఈ ఒక్క వారం మినహా అప్పటి నుంచి నేటి వరకు టేస్టీ తేజ అనుకున్న వారు అలాగే నామినేట్ చేసిన వారే ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారు.

ఇక మూడవ వారం దామిని( Damini ) ఇంటి నుంచి వెళ్లిపోగా ఆమేని సైతం టేస్టీ తేజ నామినేట్ చేశాడు.

Telugu Aata Sandeep, Bigg Boss, Damini, Kiran Rathode, Pavani, Pooja, Rathika, S

నాలుగో వారం రతికను( Rathika ) నామినేట్ చేయగా ఆమె సైతం ఎలిమినేట్ అయిపోయింది.ఐదో వారం అందాల ముద్దు గున్న శుభ శ్రీ( Subhasree ) తేజ నామినేషన్ కారణంగా ఇంటి దారి పట్టగా, ఇక ఆరో వారం నయని పావని( Pavani ) నీ తేజ నామినేట్ చేయగా ఆమె కూడా వచ్చిన వారానికే ఇంటి నుంచి వెళ్లి పోవాల్సి వచ్చింది.ఆ తర్వాత వారం మరొక వైల్డ్ కార్డు కంటెస్టెంట్ అయినటువంటి పూజ ( Pooja ) సైతం తేజ నామినేషన్ వేయడంతో ఉన్న ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.

బుధవారం ఆట సందీప్ తో తేజా నామినేషన్ మరోసారి బలమైనది అని నిరూపితమైనది సందీప్ సైతం తేజ నామినేషన్ తోనే ఎలిమినేషన్ జోలికి రావాల్సి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube