అక్కడి నుంచే షర్మిల పోటీ ! 4 న నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ , బిజెపి, కాంగ్రెస్ ( BRS BJP Congress )పై పైచేయి సాధించే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.అనుకున్నంత స్థాయిలో బలం లేకపోయినా,  రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోను అభ్యర్థులను పోటికి దింపే ఆలోచనలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు.

 Sharmila's Competition From There! Nomination On 4 , Telangana Congress, Bj-TeluguStop.com

ఇక పార్టీని స్థాపించిన దగ్గర నుంచి పాలేరు నియోజకవర్గంలో షర్మిల ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.ఇక షర్మిల అక్కడ నుంచే పోటీ చేస్తారని అనే సందర్భాల్లో ప్రకటించారు.

కాంగ్రెస్ లో తమ పార్టీని విలీనం చేసినా,  పాలేరు అసెంబ్లీ టికెట్ తనకే కేటాయించాలని షర్మిల షరతులు విధించారు.  కాంగ్రెస్ తో పొత్తు,  విలీన ప్రక్రియలో ముందుకు వెళ్లకపోవడంతో,  తన పార్టీ తరఫున పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిల డిసైడ్ అయిపోయారు.

Telugu Brs, Kandalaupendar, Telangana, Ysr Telangana-Politics

ఈ మేరకు నవంబర్ 4వ తేదీన షర్మిల పాలేరు( Paleru ) నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు.అదే రోజు నుంచి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.ఇప్పటికే పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేతలు విమర్శలు దాడి మొదలుపెట్టారు.ఇక బీఆర్ఎస్ నుంచి కందాల ఉపేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

దీంతో పాలేరులో పొంగులేటి ,షర్మిల, ఉపేందర్ రెడ్డి మధ్య హోరా హోరీగా పోరు నడిచే అవకాశం కనిపిస్తోంది.వాస్తవంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ కుటుంబం కి అత్యంత సన్నిహితుడు.

దీంతో షర్మిల కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పై పోటీ చేస్తారని అంతా భావించారు అయితే షర్మిల మాత్రం మొదటి నుంచి అనుకున్నట్టుగానే పాలేరు నుంచి పోటీ చేయబోతున్నారు.

Telugu Brs, Kandalaupendar, Telangana, Ysr Telangana-Politics

ఇక రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభ్యర్థులను పోటీకి దించే విషయం పైన ఆమె ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.కీలకమైన నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను పోటికి దించాలని చూస్తున్నారు.అయితే 119 నియోజకవర్గాల్లోనూ సరైన అభ్యర్థులు ఆ పార్టీకి లేరు.

అయినా షర్మిల( Ys Sharmila ) మాత్రం తన గెలుపుతో పాటు,  తన పార్టీ అభ్యర్థుల గెలుపు పైన ధీమాగానే ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube