పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ త్వరలోనే కీడా కోలా ( Keedaa Cola ).అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమా నవంబర్ మూడవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హైదరాబాద్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) పాల్గొని సందడి చేశారు.
ఇక విజయ్ దేవరకొండ నటించిన మొదటి సినిమా పెళ్లి చూపులు ( Pelli Choopulu ) సినిమా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda )మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.నన్ను హీరోగా మీ అందరికీ పరిచయం చేసినటువంటి డైరెక్టర్ తరుణ్ భాస్కర్( Tarun Bhaskar ) .పెరిగిన వాతావరణం, తీసుకునే నిర్ణయాలు, కలిసే వ్యక్తులు.ఈ మూడు అంశాలు మన జీవితాన్ని నిర్ణయిస్తాయి.వీటి వల్లే నేను ఇప్పుడు ఇక్కడ ఇలా మీ ముందు మాట్లాడుతున్నాను అంటూ ఈయన తెలియజేశారు.ఇక నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగ ఈ ముగ్గురు తన జీవితాన్ని మార్చేశారని తెలిపారు.

కొద్ది రోజుల క్రితం వరకు ఈ ముగ్గురు ఎవరో నాకు తెలియదు నేను ఎవరో కూడా వారికి తెలియదు ఒక్కొక్కరు ఒక్కోచోట పెరిగాము చదువుకున్నాము కానీ మా అందరిని సినిమా కలిపిందని విజయ్ దేవరకొండ తెలిపారు.విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్ అంటే ఎవరో కూడా మీకు తెలియకపోయినా మా పెళ్లి చూపులు సినిమాని మాత్రం ఆదరించారని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.సినిమాకి గాను తరుణ్ భాస్కర్‌కు నేషనల్ అవార్డు వచ్చింది.
ఇంత గొప్ప సినిమా తర్వాత ఈయనకు పెద్దపెద్ద అవకాశాలు వచ్చినప్పటికీ ఈయన మాత్రం వారితో సినిమాలు చేయలేదు, తనకు నచ్చిన సినిమాలనే చేస్తూ వచ్చారు.సినిమాని ఒక వినోదంగానే చూశారే తప్ప వ్యాపారంలో చూడలేదు అంటూ తరుణ్ భాస్కర్ ( Tharun bhaskar )గురించి విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







