వరల్డ్ సేవింగ్స్ డే( వరల్డ్ సేవింగ్స్ డే ) లేదా ప్రపంచ పొదుపు దినోత్సవాన్ని ఏటా అక్టోబర్ 30న జరుపుకుంటారు.డబ్బు ఆదా, ఆర్థిక అక్షరాస్యత ప్రాముఖ్యతను ప్రోత్సహించే రోజిది.1924, అక్టోబర్ 24న సమావేశమైన ఇంటర్నేషనల్ సేవింగ్స్ బ్యాంక్ కాంగ్రెస్ సమావేశానికి చివరి రోజైన అక్టోబర్ 30న ఏటా ప్రపంచ పొదుపు దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది.బ్యాంకులు, ఇతర మార్గాల ద్వారా డబ్బు పొదుపు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
అయితే, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, ఈ ఆలోచన ప్రజాదరణను కోల్పోయింది.ప్రపంచ పొదుపు దినోత్సవం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దాని ప్రాముఖ్యతను తిరిగి పొందింది.
పాఠశాలలు, కాలేజీలు, ఆఫీసులలో మనీ సేవింగ్ మెసేజ్‌ను వ్యాప్తి చేయడానికి కాంగ్రెస్ అంగీకరించింది.ప్రపంచ పొదుపు దినోత్సవం అధికారిక తేదీ అక్టోబర్ 31, కానీ భారతదేశంలో దీనిని అక్టోబర్ 30న జరుపుకుంటారు.
ఎందుకంటే అక్టోబర్ 31వ తేదీ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ( Indira Gandhi ) వర్ధంతి.ప్రపంచ పొదుపు దినోత్సవం 2023 థీమ్ ‘మీ రేపటిని జయించండి’.
డబ్బు ఆదా చేయడం వల్లభవిష్యత్తు లక్ష్యాలను సాధించడంలో, మీ శ్రేయస్సును ఎలా కాపాడుకోవచ్చో ఈ థీమ్ నొక్కి చెబుతుంది.డబ్బు ఆదా చేయడం అనేది ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో, భవిష్యత్తు కోసం ప్లాన్ చేయడంలో మీకు సహాయపడే ఒక ముఖ్యమైన స్కిల్.
డబ్బును సమర్థవంతంగా ఆదా చేయడంలో సహాయ పడే కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డబ్బులు వెనకేసుకోవాలనుకునేవారు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.వెకేషన్, ఎమర్జెన్సీ ఫండ్, ఇల్లు లేదా పదవీ విరమణ వంటి వాటి కోసం డబ్బు ఆదా చేయాలనుకుంటే ఆ విధంగా ప్రణాళికలు వేసుకోవాలి.ఏ ప్రణాళిక లేకపోతే డబ్బు సేవ్ చేసే ఆసక్తి రాదు.
బడ్జెట్‌ను తప్పకుండా క్రియేట్ చేసుకొని అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి.ఎక్కువగా పొదుపు చేయడానికి ప్రయత్నించాలి.
నెలనెలా ఆటోమేటిక్ గా కొంత అమౌంట్ సేవింగ్స్ కోసం కట్ అయ్యేలా సెట్ అప్ చేసుకోవాలి.ఇందుకోసం సిప్, రికరింగ్ డిపాజిట్స్ వంటి పెట్టుబడులు ప్రారంభించవచ్చు.
స్మార్ట్‌గా షాపింగ్ చేయడం కూడా ముఖ్యమే: వస్తువులను కొనుగోలు చేసినప్పుడు డీల్‌లు, కూపన్‌లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ల కోసం చూడాలి.డబ్బు ఆదా చేయడం అనేది ఒక సారి సాధ్యమయ్యే పని కాదు.మనీ సేవింగ్ అనేది కాలక్రమేణా అభివృద్ధి చేసుకోవలసిన అలవాటు అని గుర్తుంచుకోండి.చిన్నగా ప్రారంభించి క్రమంగా పొదుపును పెంచుకోవడం ఉత్తమం.స్థిరంగా సేవింగ్స్ చేస్తూ ఉంటే కొంతకాలానికి చాలా డబ్బు అవుతుంది.