వరుణ్ లావణ్య పెళ్లి వేడుకలకు అంజనా దేవి దూరంగా ఉన్నారా.. కారణాలు ఇవేనంటూ?

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి( Varun tej-Lavanya Tripathi ) కాంబినేషన్ లో రెండు సినిమాలు తెరకెక్కగా రెండు సినిమాలు ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు.అయితే ఆ సినిమాల వల్ల ప్రేమలో పడిన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నవంబర్ 1వ తేదీన ఏడడుగులు వేయబోతున్నారు.

 Varun Tej Lavanya Tripathi Marriage On November 1st Details Here Goes Viral In S-TeluguStop.com

రామ్ చరణ్ ఉపాసన ఇప్పటికే ఇటలీకి వెళ్లి అక్కడ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను గ్రాండ్ గా చేస్తున్నారు.మెగా అల్లు ఫ్యామిలీ( Mega Allu Family ) కుటుంబ సభ్యులు సైతం ఈరోజు ఈరోజు ఇటలీకి చేరుకోనున్నారు.

ఈ నెల 30వ తేదీన కాక్ టేల్ పార్టీతో పెళ్లి వేడుకలు మొదలుకానుండగా ఈ నెల 31వ తేదీన హల్దీ, మెహందీ మొదలుకానున్నాయి.నవంబర్ నెల 5వ తేదీన హైదరాబాద్ లో రిసెప్షన్ జరగనుంది.

వరుణ్ లావణ్యల పెళ్లి( Varun tej-Lavanya Tripathi Wedding Card ) )కి సంబంధించిన కార్డ్ నెట్టింట వైరల్ అయింది.ట్విట్టర్ లొ #varunlav అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండింగ్ అవుతోంది.అయితే నాగబాబు తల్లి అంజనా దేవి( Anjana Devi ) మాత్రం ఈ పెళ్లి వేడుకకు హాజరు కావడం లేదని తెలుస్తోంది.ఆమె ఆరోగ్యరిత్యా దూరప్రయాణాలు చేయడం మంచిది కాదని వైద్యులు చెప్పడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.

ఇంటినుంచి లైవ్ లో అంజనాదేవి పెళ్లి వేడుకను చూసే విధంగా ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది.వరుణ్ లావణ్యల పెళ్లి వేడుకకు సంబంధించిన ప్రతి విషయం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

వరుణ్ లావణ్య కలకాలం సంతోషంగా జీవనం సాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

వరుణ్ తేజ్ లావణ్య జోడీ చూడముచ్చటగా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ మధ్య కాలంలో సరైన విజయం దక్కని వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్, మట్కా సినిమాలతో బిజీగా ఉన్నారు.ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube