కేరళలో భారీ పేలుడు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.ఎర్నాకులంలోని ఓ క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో బ్లాస్ట్ సంభవించిందని తెలుస్తోంది.
ఈ పేలుడు ఘటనలో ఒకరు మృత్యువాత పడగా సుమారు ఇరవై మంది గాయపడ్డారని సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
బాధితులను సమీప ఆస్పత్రికి తరలించి, పేలుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







