ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ( గతంలో ట్విట్టర్ ) రెండు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.ఎలోన్ మస్క్ ట్విటర్‌ను టేకోవర్ చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టారు.కొత్త ప్లాన్‌ల ప్రకారం, భారతీయ యూజర్లకు సబ్‌స్క్రిప్షన్ ఖర్చులు నెలకు రూ.244, రూ.1,300గా ఉండనున్నాయి.ప్లాట్‌ఫారమ్‌లో యూజర్ల అనుభవాన్ని మరింత మెరుగుపర్చేందుకు కొత్త సబ్‌స్క్రిప్షన్‌లు తీసుకొచ్చినట్లు ఎక్స్ (ట్విట్టర్) వెల్లడించింది.
ఇప్పటికే ఉన్న ప్రీమియం, ప్రీమియం+ ప్లాన్‌ల మధ్య పెద్ద తేడా ఏమీ లేనప్పటికీ, ఎక్స్ సబ్‌స్క్రిప్షన్( X Subscription )ని పొందాలని భావిస్తున్న వారు వీటి గురించి తెలుసుకోవడం మంచిది.కొత్తగా తీసుకొచ్చిన ప్రీమియం+ ప్లాన్ నెలవారీ రుసుమును ఎంచుకునే వారికి సంవత్సరానికి రూ.13,600 ఖర్చు అవుతుంది, అది నెలకు రూ.1,300కి తగ్గవచ్చు.
ఎక్స్ ఈ కొత్త ప్లాన్‌తో మెరుగైన వినియోగదారు అనుభవాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది.ప్రీమియం+ ప్లాన్‌లోని ఫీచర్‌లలో పోస్ట్‌లను ఎడిట్ చేయడం, ఎక్కువ పోస్ట్‌లను షేర్ చేయడం, పోస్ట్‌లను అన్‌డు చేయడం, లాంగ్ వీడియోలను పోస్ట్ చేయడం, ఎలాంటి డిస్ట్రక్షన్‌లు లేకుండా పొడవైన థ్రెడ్‌లను( Threads ) చదవడం, బ్యాక్‌గ్రౌండ్ వీడియో ప్లేబ్యాక్, వీడియోలు డౌన్‌లోడ్, ప్రకటనలు లేని వినియోగం వంటివి పొందొచ్చు.

అంతేకాకుండా, ప్రీమియం+ ప్లాన్ పోస్ట్( X Subscription Premium ))కి చెల్లింపు, క్రియేటర్ సబ్‌స్క్రిప్షన్‌లు, ఎక్స్ ప్రో, మీడియా స్టూడియో, అనలిటిక్స్ వంటి ఫీచర్లతో కంటెంట్ క్రియేటర్లకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది.ఇది కాకుండా మరో బేసిక్ ప్లాన్‌ను కూడా ఎక్స్ తీసుకొచ్చింది.చౌకైన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.ప్లాన్ సంవత్సరానికి రూ.2,590.48 ఖర్చవుతుంది.నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ.244కి వస్తుంది.బేసిక్ ప్లాన్ సబ్‌స్క్రైబర్‌లు వెరిఫైడ్ చెక్‌మార్క్‌ను పొందలేరు.ప్రకటనలు ఉంటాయి.ఇవి కాకుండా ప్రస్తుత ప్రీమియం ప్లాన్ సంవత్సరానికి రూ.6,800 మరియు నెలకు రూ.650.ఈ ప్లాన్ ఫీచర్లు గతంలో మాదిరిగానే ఉన్నాయి.







