టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో దిల్ రాజు( Dil Raju ) ఒకరు కాగా దిల్ రాజు రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.నైజాం ఏరియాలో ఎంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నా దిల్ రాజుకు పోటీ ఇచ్చేవాళు ఎవరూ లేరనే సంగతి తెలిసిందే.
అయితే దిల్ రాజు మేనేజర్ కు, వైజాగ్ థియేటర్ల ఓనర్లకు మధ్య జరిగిన రగడ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.

వైజాగ్ ( Vizag )లో పేరున్న థియేటర్లలో సంగం, శరత్ ముందువరసలో ఉంటాయి.దిల్ రాజు మేనేజర్ ఈ థియేటర్లలో ఛత్రపతి స్పెషల్ షో వేయాలని కోరగా థియేటర్ల నిర్వాహకులు నిరాకరించారట.స్పెషల్ షోలు వేయడం వల్ల థియేటర్లు పాడైన సందర్భాలు ఉండటంతో ఆ థియేటర్ల ఓనర్లు ఈ విధంగా చేశారని సమాచారం అందుతోంది.
ఆ తర్వాత దిల్ రాజు మేనేజర్ మీ థియేటర్లకు సినిమాలు ఎలా వస్తాయో చూస్తా అని అన్నారట.

ఆ తర్వాత థియేటర్ల ఓనర్లు మా మీద రుబాబు చేస్తావా? అని చెప్పినట్టు సమాచారం.దిల్ రాజు ఆఫీస్ విశాఖ మేనేజర్ చేసిన తప్పు వాళ్లకు చాలా ఆగ్రహం కలిగించిందని సమాచారం అందుతోంది.ఆ తర్వాత దిల్ రాజు విశాఖ మేనేజర్ తనకు ప్రాణ హాని ఉందని సోషల్ మీడియా వేదికగా మెసేజ్ పెట్టడం జరిగింది.
అయితే దిల్ రాజు మాత్రం ఈ సమస్య పరిష్కారమైందని చెబుతున్నారు.విశాఖ ఆఫీస్ మేనేజర్ శ్రీను( Srinu ) సైతం చిన్న సమస్య అని ఇప్పుడు సమస్యకు సొల్యూషన్ దొరికిందని చెప్పారు.
దిల్ రాజు ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.పాన్ ఇండియా ప్రాజెక్ట్ లను నిర్మిస్తున్న దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
దిల్ రాజు ప్రస్తుతం నిర్మిస్తున్న సినిమాల బడ్జెట్ 500 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది.







