కేరాఫ్ కంచరపాలెం సినిమాతో డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకటేష్ మహా( Venkatesh Maha ) .ఆ తర్వాత ఓ రీమేక్ సినిమా తీశారు.
ఇలా పలు సినిమాలు చేయడమే కాకుండా నటుడుగా కూడా పలు చిత్రాలలో నటించి మెప్పించారు.ప్రస్తుతం ఈయన సినిమాలకు దర్శకత్వం వహించకపోయిన నిర్మాణ రంగంలో మాత్రం ఎంతో బిజీగా ఉన్నారు.
తాజాగా ఈయన సంపూర్ణేష్ బాబు ( Sampoornesh Babu ) హీరోగా నటించిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వెంకటేష్ మహా గతంలో తన గురించి వచ్చినటువంటి విమర్శలపై స్పందించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గతంలో వెంకటేష్ మహా KGF సినిమా( KGF Movi e) పై విమర్శలు చేయడంతో సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్స్ ఎదుర్కున్నాడు.తాజాగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విమర్శల గురించి ఈయన మాట్లాడుతూ.ఆ వివాదం ముందు కానీ, తర్వాత కానీ నాకు ఎలాంటి కాంట్రవర్సీలు లేవు.అది కూడా కొంతమంది సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు చేశారు.తప్ప బయట వాళ్ళెవరికీ తెలీదు.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నేను చాలామందిని కలిసాను ఎక్కడా కూడా నాకు ఈ విషయం గురించి ప్రశ్నలు ఎదురు కాలేదు.

కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హడావిడి చేస్తూ ఉంటారు.అయితే ఇలా సోషల్ మీడియాలో వచ్చే హడావిడిని తాను పట్టించుకోనని నా దృష్టిలో అలాంటి వాళ్ళు మనుషులే కాదు అంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇక ఇండస్ట్రీలోకి తాను ఏదో పబ్లిసిటీ కోరుకొని ఇక్కడికి రాలేదని, నా కథలను చెప్పి సినిమాలు చేసుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చానని ఈయన తెలిపారు.ఇలా కేజిఎఫ్ సినిమా వివాదం గురించి మరోసారి వెంకటేష్ మహా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







