ఏంటి సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) ని కిడ్నాప్ చేసి పెళ్లి చేశారా.వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
సూపర్ స్టార్ కృష్ణ ( Krishna ) వారసుడిగా ఇండస్ట్రీకి రాజకుమారుడు అనే సినిమాతో అరంగేట్రం చేశారు మహేష్ బాబు.ఇక ఈయన సినీ కెరియర్ లో మురారి,ఒక్కడు,అతడు, దూకుడు, బిజినెస్ మాన్, పోకిరి వంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నాయి.
ఇక మహేష్ బాబు కి ఎంతమంది లేడీ ఫ్యాన్స్ ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక మహేష్ పెళ్లయిన సమయంలో చాలామంది అమ్మాయిలు కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు నమ్రతని వంశీ సినిమా ( Vamshi movie ) సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని అందరూ భావిస్తూ ఉంటారు.ఇక అసలు విషయం ఏమిటంటే.వంశీ సినిమా షూటింగ్ సమయంలో నమ్రత మహేష్ బాబుకి ప్రపోజ్ చేసిందట.కానీ మహేష్ మాత్రం కొన్ని రోజులు ఆ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయలేదట.ఇక అలా తన సినీ కెరీర్ లో దూసుకుపోతున్న సమయంలో అతడు సినిమా సమయంలో త్రిషతో మహేష్ కాస్త క్లోజ్ గా ఉన్నారు అని టాలీవుడ్లో టాక్ వినిపించేసరికి ఇదంతా భరించలేని నమ్రత రాత్రికి రాత్రే మహేష్ బాబు ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టిందట.

అయితే స్టార్ హీరో కొడుకు కాబట్టి చాలామంది మహేష్ బాబు పెళ్లి పెద్ద పండగలా జరుగుతుంది అని అనుకున్నారు.కానీ మహేష్ బాబు పెళ్లి చాలా సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరిగింది.ఇక నమ్రతని తన ఇంటి కోడలు కావడం కృష్ణ( Krishna ) అంగీకరించలేదట.
ఎందుకంటే నమ్రత ( Namrata ) కి అప్పటికే బాలీవుడ్లో కొంతమందితో ఎఫైర్స్ ఉండడం వల్ల పెళ్లికి నిరాకరించారట.కానీ అలా వార్తలు వచ్చిన కొద్ది రోజులకే వీరి పెళ్లి ఫోటోలు బయటపడ్డాయి.
అయితే వీరు అలా సింపుల్ గా పెళ్లి చేసుకున్న సమయంలో మహేష్ బాబుని ముంబై మాఫియా గ్యాంగ్ కిడ్నాప్ చేసి నమ్రత తో పెళ్లి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా చేశారు అని,ఇక నమ్రతకి మహేష్ అంటే ఇష్టం ఉండడంతో నమ్రత అక్క శిల్ప ( Shilpa ) ముంబై మాఫియా తో మాట్లాడి ఈ పని చేయించింది అని,అందుకే వీరిద్దరి పెళ్లి రహస్యంగా, సింపుల్ గా జరిగింది అంటూ బాలీవుడ్ మీడియాలో ఒక వార్త వీరి పెళ్లి సమయంలో చక్కెర్లు కొట్టింది.అయితే ఇందులో ఎంత నిజం ఉందో ఎవరికి తెలియదు.
ఎందుకంటే మహేష్ బాబు ( Mahesh Babu ) నమ్రత చాలా అన్యోన్యంగా ఉంటారు.ఒకవేళ మహేష్ నమ్రతను బలవంతంగా పెళ్లి చేసుకుంటే విడాకులు తీసుకోవడానికి ఒక్క క్షణం కూడా పట్టదు.
కానీ నమ్రతను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టే ఆమెతో ఇన్ని రోజులు కలిసి ఉంటున్నాడు అని మహేష్ బాబు అభిమానులు ఈ వార్తలు కొట్టి పారేస్తున్నారు.