వీధి కుక్క కోసం ఇండియాలోనే 6 నెలలు ఉన్న డచ్ యువతి..

వారణాసికి చెందిన ఒక వీధి కుక్క నెదర్లాండ్స్‌లో( Netherlands ) కొత్త ఇంటిని కనుగొంది.ఒక డచ్ టూరిస్ట్‌ భారతదేశంలో పర్యటిస్తుండగా ఈ కుక్క ఆమెతో స్నేహం పెంచుకుంది.

 Dutch Tourist Adopts Stray Dog From Varanasi Details, Tourist Visa, Street Dog,-TeluguStop.com

టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చిన మెరల్ బొంటెన్‌బెల్( Meral Bontenbel ) వారణాసిలో నడుచుకుంటూ వెళుతుండగా జయ అనే ఆడ కుక్కను కలిశారు.జయ ఆమెను ఫాలో అయ్యింది.

వారి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది.ఒకరోజు జయపై మరో కుక్క దాడి చేయడం, సెక్యూరిటీ గార్డు దాన్ని రక్షించడం ఆమె చూసారు.

కుక్కలు వీధిలో ఇన్ని బాధలు పడాలని అప్పుడే ఆమెకు అర్థమయింది.జయ లాంటి మంచి కుక్కకు ఇలాంటి కష్టాలు రాకూడదని, దానిని దత్తత తీసుకోవాలని బోంటెన్‌బెల్ నిర్ణయించుకున్నారు.

జయకు మంచి జీవితాన్ని ప్రసాదించాలని, వీధుల ప్రమాదాల నుంచి దాన్ని కాపాడాలని కోరుకున్నారు.

అయితే జయను( Jaya dog ) దత్తత తీసుకోవడం అంత ఈజీ పని కాలేదు.జయ కోసం పాస్‌పోర్ట్, క్వారంటైన్ సర్టిఫికేట్ పొందడానికి బోంటెన్‌బెల్ మరో ఆరు నెలలు భారతదేశంలోనే( India ) ఉండవలసి వచ్చింది.ఆమె వివిధ ఫార్మాలిటీలు, పేపర్‌వర్క్‌లను కూడా పూర్తి చేయాల్సి వచ్చింది.

ఎట్టకేలకు జయను తనతో తీసుకెళ్లడం చాలా సంతోషంగా ఉందని ఆమె ఓ న్యూస్ వెబ్‌సైట్‌తో చెప్పారు.తాను ఎప్పుడూ కుక్కలను( Dogs ) ప్రేమిస్తానని, జయ తన వద్దకు వచ్చిన తొలి రోజే తన మనసును గెలుచుకుందని చెప్పారు.

వార్తా సంస్థ ఏఎన్ఐ బోంటెన్‌బెల్, జయ భారతదేశం విడిచి పెట్టడానికి డాక్యుమెంట్స్ తో సహా రెడీ అయినట్లు వీడియోను పంచుకుంది.తన కొత్త యజమానితో కలిసి నెదర్లాండ్స్ వెళ్లేందుకు జయ సిద్ధమైందని వీడియో క్యాప్షన్‌లో పేర్కొన్నారు.ఈ వీడియో చూసిన నెటిజన్లలో బోంటెన్‌బెల్‌ను చాలామంది మెచ్చుకుంటున్నారు, జయ మంచి జీవితం గడపాలని కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube