సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు అని అడిగితే ఎవరికైనా మైండ్ లోకి గుర్తుకు వచ్చే మొట్టమొదటి పేరు సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ).ఒక సాధారణ బస్సు కండక్టర్ గా కెరీర్ ని కొనసాగిస్తున్న రజినీకాంత్ కి అనుకోకుండా సినిమాల్లో అవకాశాలు రావడం, వచ్చిన ప్రతీ అవకాశం ని ఉపయోగించుకొని సక్సెస్ లు అందుకుంటూ సూపర్ స్టార్ గా ఎదగడం మనమంతా చూస్తూనే ఉన్నాం.
జీవితం లో పైకి రావళి అని కోరుకునే ప్రతీ మనిషికి రజినీకాంత్ ఒక ఆదర్శం లాంటి వాడు.ఆయనని ఇష్టపడని నటీనటులంటూ ఎవ్వరూ ఉండరు.
అందరూ ఆయన అభిమానులే.ముఖ్యంగా ఆయన పక్కన చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చినా ఎవ్వరూ వదులుకోరు.
ఎందుకంటే ఆయన సినిమాలో నటిస్తే ప్రపంచం మొత్తం రీచ్ అవుతామని ఒక చిన్న ఆశ.ముఖ్యంగా హీరోయిన్స్ అయితే ఛాన్స్ వస్తే అసలు వదులుకోరు, ఎలాంటి పాత్రలో నటించడానికి అయినా సిద్దమైపోతారు.

అయితే ఒకప్పుడు సౌత్ లో నెంబర్ 1 స్టార్ హీరోయిన్ గా కొనసాగిన త్రిష కృష్ణన్ ( Trisha Krishnan )మాత్రం రజినీకాంత్ పక్కన హీరోయిన్ గా నటించే ఛాన్స్ వస్తే వదులుకుంది అట.అప్పట్లో రజినీకాంత్ మరియు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘శివాజీ’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీయ శరన్ ( Shriya Saran )నటించింది.అప్పట్లో ఈ చిత్రం సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది.
హీరోయిన్ గా నటించిన శ్రీయ కి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా.అయితే ఈ పాత్ర ముందుగా త్రిష కి వచ్చిందట.ఇంత పెద్ద కాంబినేషన్ మూవీ లో హీరోయిన్ గా చేస్తే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ మాత్రం వదులుకుంటుంది?, కానీ త్రిష వదులుకుందట.కారణం అప్పటికే ఆమె చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

ఈ పాత్ర నీకు కరెక్ట్ గా ఉంటుంది, ఎలాగో అలా డేట్స్ సర్దుబాటు చేసి ఇవ్వు అని శంకర్ అడిగినా కుదరదు అని చెప్పిందట.దీంతో సెకండ్ ఛాయస్ గా శ్రీయ శరన్ ని సంప్రదించి ఆమెని హీరోయిన్ గా తీసుకున్నారు. రజిని – త్రిష ( Rajinikanth Trisha )హీరో హీరోయిన్లు గా కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు కానీ , పేట సినిమా( Petta )లో మాత్రం రజినీకాంత్ కి చెల్లెలు గా నటించింది త్రిష.ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయ్యింది.
అయితే ప్రస్తుతం రజినీకాంత్ చెయ్యబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చిందట త్రిష కి.కానీ ఒక్కసారి చెల్లిగా నటించి మళ్ళీ అదే హీరో తో రొమాన్స్ చెయ్యడం ఇష్టం లేదని ఈ సినిమాలో నటించేందుకు నిరాకరించింది అట త్రిష.







