రతికను అక్కా అని పిలిచిన పల్లవి ప్రశాంత్.. రతిక అలా అనడంతో హౌస్ లో బోరున ఏడుస్తూ?

బిగ్ బాస్ షో సీజన్7లో రతిక పల్లవి ప్రశాంత్( Pallavi prashanth ) ట్రాక్ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.రతిక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఆట తీరు మారింది.

 Palalvi Prashanth Comments About Rathika Details Here Goes Viral In Social Media-TeluguStop.com

రతిక బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ కొత్త సమస్యలు మొదలయ్యాయి.రతికా రోజ్ పల్లవి ప్రశాంత్ ను అక్కా అని పిలవడం గమనార్హం.

పల్లవి ప్రశాంత్ అలా పిలవడంతో షాకవ్వడం రతిక వంతయింది.

అక్క అనవద్దని నన్ను రతిక అని పిలవాలని పల్లవి ప్రశాంత్ కోరగా రతిక ఎంత చెప్పినా ప్రశాంత్ వినకపోవడంతో రతిక తమ్ముడు అని పిలిచి షాకివ్వడం గమనార్హం.రతికను అక్కా అని పిలిచిన పల్లవి ప్రశాంత్ రతిక తమ్ముడు అని పిలిస్తే మాత్రం తట్టుకోలేకపోయాడు.బోరున ఏడ్చడంతో పాటు రతికపై తనకు అభిమానం, ఆప్యాయత ఉందని రతిక అలా పిలిస్తే మాత్రం తట్టుకోలేనని చెప్పకనే చెప్పేశాడు.

ఆ తర్వాత భోలే షవాలే పల్లవి ప్రశాంత్, రతికలకు ( Rathika )గతాన్ని మరిచిపోవాలని సూచనలు చేశారు.ఆ తర్వాత శివాజీ ఎంట్రీ ఇచ్చి మీరు చిన్నపిల్లలని గతంలో జరిగిందేదో జరిగిందని అన్నారు.ఆ విషయాలను తవ్వుకుని బాధ పడవద్దని శివాజీ వాళ్లిద్దరికీ నచ్చజెప్పడం గమనార్హం.పల్లవి ప్రశాంత్ లో నిజాయితీ ఉందని పల్లవి ప్రశాంత్ లో కల్మషం లేదని శివాజీ కామెంట్లు చేశారు.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత మీకు నచ్చిన విధంగా జీవనం సాగించిండని శివాజీ కామెంట్లు చేశారు.మరోవైపు బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ జోరుగా సాగింది.

పంట పండించేవాడికి అమ్ముకోవడం కూడా తెలియాలని అమర్ దీప్ తెలిపారు.బిగ్ బాస్ సీజన్7 ఆశించిన రేంజ్ లో హిట్ కాలేదని చాలామంది ఫీలవుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube