స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) దసరా బరిలో తన సినిమాను నిలిపిన విషయం తెలిసిందే.ఈయన తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘లియో’ ( LEO ).
ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది.భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధిస్తూ దూసుకు పోతుంది.
ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది.

అయితే మిక్స్డ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ మాత్రం నిరాశగా ఉన్నారు.అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.దసరా సెలవలు కావడంతో ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టింది.
లేకపోతే ఇది ప్లాప్ గా మిగిలిపోయి ఉండేది.ఏది ఏమైనా రెండవ వారంలోకి అడుగు పెట్టిన లియో ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 475 కోట్లు( Leo Worldwide Collections ) రాబట్టినట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్( Leo OTT Release Date ) గురించి లేటెస్ట్ గా ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్ అని ఒప్పందం చేసుకుందట.
మరి ఈ లెక్కన ఈ సినిమాను నవంబర్ 21న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది.అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని టాక్.

కాగా ‘లియో’ ( LEO )సినిమాలో విజయ్ కు జంటగా స్టార్ హీరోయిన్ త్రిష ( Trisha )నటించింది.సంజయ్ సత్, గౌతమ్ మీనన్, అర్జున్, ప్రియా ఆనంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.







