Amala Paul Jagat Desai : అమలాపాల్ పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి బ్యాగ్రౌండ్ ఇదే.. అందుకే ప్రేమకు ఓకే చెప్పిందంటూ?

యస్.ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 Amala Paul Boyfriend Jagat Desai Background Details-TeluguStop.com

స్టార్ హీరోయిన్ అమలాపాల్‌( Heroine Amala Paul ) కు రెండో పెళ్లికి సిద్ధమైంది.అయితే ఇప్పటికే మొదటి సారి డైరెక్టర్‌ విజయ్‌ను పెళ్లాడిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇప్పుడు మరోసారి పెళ్లి పీటలెక్కడానికి రెడీ అవుతోంది.

తన ప్రియుడు జగత్‌ దేశాయ్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

ఈ మేరకు ఆ విషయాన్ని తెలుపుతూ మీడియాలో ఒక వీడియోను షేర్ చేస్తూ అఫీషియల్‌గా ప్రకటించింది.ఆమెను చేసుకోబోతున్న జగత్‌ ఎవరనే దానిపై నెటిజన్స్‌తో పాటు ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.

Telugu Amala Paul, Vijay, Jagat Desai, Jagatdesai, Tollywood-Movie

ఆ జగత్ ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏంటి? అతడు ఏం చేస్తాడు ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు నెటిజన్స్ మైండ్ లో మెదులుతున్నాయి.మరి ఆ వివరాల్లోకి వెళితే.అమలాపాల్‌ పెళ్లాడబోతున్న జగత్‌ దేశాయ్‌( Jagat Desai ) ఎవరనే విషయంపై ఆమె ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది.దీంతో అతను ఏం చేస్తాడా? అని తెగ ఆరా తీస్తున్నారు.జగత్ దేశాయ్ గోవాలోని ఒక విల్లా గ్రూప్‌లో సేల్స్ హెడ్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.అయితే గతంలో అమలాపాల్‌ సైతం గోవా బీచ్‌( Goa Beach )లో ఉన్న ఫోటోలు తన ఇన్‌స్టాలో పంచుకున్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది జూన్‌ నుంచే అమలాపాల్‌ అతనితో డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu Amala Paul, Vijay, Jagat Desai, Jagatdesai, Tollywood-Movie

జగత్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌( Jagat Desai Instagram )లు చూస్తే అమలాపాల్ లైక్‌ కొట్టడం, కామెంట్స్ చేయడం కనిపించింది.ఇప్పటి వరకు ఎక్కడా కూడా తన రిలేషన్‌ గురించి బయటికి చెప్పలేదు.కాగా తాజాగా తన బర్త్‌డే రోజున అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది అమలా పాల్.

ఇది చూసిన అభిమానులు అమలాపాల్‌కు అభినందనలు చెబుతున్నారు.కాగా బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా ఆడుజీవితంలో అమలాపాల్ కనిపించనుంది.

ఆ తర్వాత ద్విజ అనే మరో మలయాళ చిత్రంలో నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube