తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసింది.ఈ మేరకు సాయంత్రం గాంధీభవన్ లో పార్టీ ముఖ్యనేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు.
రేపటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ మలి విడత ప్రచారం ప్రారంభం కాబోతుంది.ఈ క్రమంలో ప్రచార తీరు తెన్నులపై నాయకులు ప్రధానంగా చర్చించనున్నారు.
సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్, కర్ణాటక మంత్రి బోసు రాజు హాజరుకానున్నారు.అదేవిధంగా మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఈ భేటీలో పాల్గొననున్నారు.
కాగా రేపు నిర్వహించే ఎన్నికల ప్రచారానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రానున్నారు.ఈ క్రమంలోనే వికారాబాద్ నుంచి చేవెళ్ల వరకు నిర్వహించే ప్రచార పర్వంలో డీకే శివకుమార్ పాల్గొననున్నారు.







