టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి( Rajamouli ) ఒకరు కాగా స్టూడెంట్ నంబర్1 నుంచి ఆర్.ఆర్.
ఆర్ వరకు జక్కన్నకు వరుస విజయాలు దక్కుతున్నాయి.నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న ఈ డైరెక్టర్ ప్రశంసలు అందుకోవడంతో పాటు సినిమా సినిమాకు కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywood ) నుంచి 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించిన సినిమాలు జక్కన్న ఖాతాలోనే ఉన్నాయి.
చాలామంది డైరెక్టర్లు( Directors ) వరుస విజయాలు సాధిస్తున్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి మాత్రమే తోపు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజమౌళిని మించిన డైరెక్టర్ ఎవరూ లేరు అని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.రాజమౌళి రాజీపడని మనస్తత్వం వల్లే ఆయన సినిమాలు అంచనాలను మించి విజయం సాధించడంతో పాటు కలెక్షన్ల విషయంలో రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి.

జక్కన్న వయస్సుతో పాటు ఆయనకు ఉన్న క్రేజ్, రేంజ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.జక్కన్న స్థాయి బడ్జెట్లతో సినిమాలు తీయడానికి కూడా చాలామంది దర్శకులకు ధైర్యం చాలడం లేదు.రాజమౌళి సినిమాలకు బిజినెస్( Rajamoui Movies Business ) కూడా వేరే లెవెల్ లో జరుగుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.జక్కన్న రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

రాజమౌళి భిన్నమైన కథలను ఎంచుకోవడం వల్లే ఆయనకు సక్సెస్ దక్కుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతున్న రాజమౌళి భవిష్యత్తు సినిమాలతో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.సినిమా సినిమాకు జక్కన్న మర్కెట్ ఊహించని స్థాయిలో పెరగడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.అయితే ఈ రేంజ్ లో సక్సెస్ అయినా జక్కన్న ఎంత సింపుల్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రాజమౌళి టాలెంట్ కు తగ్గ విజయాలు రాబోయే రోజుల్లో సైతం దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.








