యూట్యూబ్ లో వీడియోలు చూసి సివిల్స్ సాధించిన యువతి.. ఈ యువతి సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

మనలో చాలామంది యూట్యూబ్ ( Youtube )ను ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగిస్తారనే సంగతి తెలిసిందే.అయితే ఉన్నత చదువులు చదువుకోవాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూర్చేలా యూట్యూబ్ లో ఎన్నో అద్భుతమైన వీడియోలు అందుబాటులో ఉన్నాయి.

 Anushta Kalia Success Story Details Here Goes Viral In Social Media , Anushta Ka-TeluguStop.com

ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్న సంగతి తెలిసిందే.చిన్నస్థాయిలో ఉద్యోగం నుంచి పెద్దస్థాయిలో ఊద్యోగం వరకు మహిళలు అన్ని ఉద్యోగాలు చేస్తూ సత్తా చాటడంతో పాటు ప్రశంసలు పొందుతున్నారు.

సివిల్స్ సాధించిన యువతులలో ఢిల్లీకి చెందిన అనుష్త కాలియా( Anushta Kalia ) ఒకరు కాగా ఈ యువతి సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ సివిల్స్ లో అనుష్త కాలియా 143వ ర్యాంక్ సాధించడం గమనార్హం.ఆనుష్త కలియా కాలేజ్ లో చదువుకునే రోజుల్లోనే బ్యాడ్మింటన్, కరాటే పోటీలలో పాల్గొన్నారని సమాచారం అందుతోంది.

శిక్షణ అనంతరం అనుష్త గంటకు 16 కిలోమీటర్లు పరిగెత్తే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు.ప్రజాసేవలో టెక్నాలజీని ఉపయోగించడమే తన లక్ష్యమని ఆమె వెల్లడిస్తున్నారు.ఎన్.పీ.ఏ శిక్షణలో తాను ఎన్నో అంశాలను నేర్చుకున్నానని అనుష్త చెబుతున్నారు.నెల రోజుల జంగిల్ ట్రైనింగ్ నాకు ఎంతో కష్టంగా అనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు.ఢిల్లీ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసిన అనుష్త అక్కడే బ్లింకిట్( Blinkit) అనే కంపెనీలో డేటా సైంటిస్ట్ గా చేరారు.

సివిల్ సర్వీసెస్ పై ఉన్న ఆసక్తితో ఆరు నెలలకే ఉద్యోగానికి రాజీనామా చేసిన అనుష్త కరోనా సమయంలో ఆన్ లైన్ క్లాసుల ద్వారా శిక్షణ పొంది కెరీర్ పరంగా లక్ష్యాన్ని సాధించారు.అనుష్త వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

అనుష్త కాలియా రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని లక్ష్యాలను సాధించి సంచలన విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

Civil Ranker Anushta Kalia Success Story

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube