మహేష్ బాబు 'గుంటూరు కారం' ఇలా తయారయ్యిందేంట్రా బాబు?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరో గా త్రివిక్రమ్‌ ( Trivikram ) దర్శకత్వం లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా( Guntur Karam Movie ) రెండేళ్లు గా ఫ్యాన్స్ ని ఊరిస్తూనే ఉంది.ఇప్పటి వరకు కూడా సినిమా విడుదల విషయం లో క్లారిటీ లేదు.

 Mahesh Babu And Trivikram Movie Gunturu Karam Release Date Update Details, Mahes-TeluguStop.com

యూనిట్‌ సభ్యులు సంక్రాంతికి అంటున్నారు కానీ మీడియా లో జరుగుతున్న ప్రచారం మరియు యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న ఆఫ్ ది రికార్డ్‌ సమాచారం ప్రకారం షూటింగ్ పూర్తి అవ్వడానికి చాలా సమయం పడుతుంది.కనుక ఇప్పట్లో సినిమా ను విడుదల చేసేది కష్టమే అన్నట్లుగా వారు మాట్లాడుకుంటున్నారు.

అదే కనుక నిజం అయితే సమ్మర్ వరకు గుంటూరు కారం సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు వెయిట్‌ చేయాల్సి రావచ్చు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Trivikram, Guntur Karam, Mahesh Babu, Sreeleela, Telugu-Movie

సోషల్‌ మీడియా లో ప్రస్తుతం గుంటూరు కారం సినిమా పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి.ఆ మధ్య దసరా కి( Dasara ) కచ్చితంగా అప్డేట్ ఉంటుందని అన్నారు.కానీ ఇప్పుడు దీపావళికి కచ్చితంగా అప్డేట్‌ ఇవ్వబోతున్నట్లుగా చెబుతున్నారు.

అదే కనుక నిజం అయితే కచ్చితంగా గుంటూరు కారం సినిమా సమ్మర్‌ లో విడుదల ( Summer Release ) అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.ఏడాది నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Telugu Trivikram, Guntur Karam, Mahesh Babu, Sreeleela, Telugu-Movie

మొత్తానికి గుంటూరు కారం గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్న సమయంలో విడుదల విషయమై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ముందు ముందు ఈ సినిమా గురించి మరెన్ని వార్తలు వినాల్సి వస్తుందో అన్నట్లుగా నెటిజన్స్‌ మాట్లాడుకుంటున్నారు.ఈ సినిమా లో శ్రీ లీల ( Sreeleela ) హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.మీనాక్షి చౌదరి( Meenakshi Choudary ) మరో హీరోయిన్ గా నటిస్తోంది.

సమ్మర్ రిలీజ్ గురించి ఏ సమయం లో అయినా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube