కోలీవుడ్ హీరోల్లో అద్బుతమైన ఫాలోయింగ్ కలిగి ఉన్న సెన్సేషనల్ హీరోల్లో సూర్య( Hero Suriya ) ఒకరు.ఈ మధ్య కాలంలో సూర్య నటిస్తున్న అన్ని సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలు సాధిస్తున్నాయి.
దీంతో ఈయన సినిమాలపై మరింత హైప్ ఏర్పడుతుంది.అంతేకాదు ఈయన క్రేజ్ ప్రపంచ స్థాయికి చేరుకుంది.
ప్రస్తుతం సూర్య డైరెక్టర్ శివ దర్శకత్వంలో ”కంగువ”( Kanguva ) సినిమాను చేస్తున్నాడు.పీరియాడికల్ యాక్షన్ డ్రామా ( Periodical Action Drama ) గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ అండ్ గ్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.

ఇక ఈ సినిమా తర్వాత సూర్య తన 4 3వ సినిమాను సెన్సేషనల్ దర్శకురాలు సుధా కొంగరతో చేస్తున్న విషయం తెలిసిందే.ఈ కాంబో ఇప్పటికే ఆకాశమే నీ హద్దురా అనే సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది.ఇక ఇప్పుడు ఈ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతుంది.
ఆ ప్రాజెక్ట్ పై ఈ రోజు మోస్ట్ ఏవైటెడ్ అప్డేట్ వచ్చింది.మోషన్ పోస్టర్ టీజర్ రిలీజ్ చేసారు.
ఈ మోషన్ పోస్టర్ పవర్ఫుల్ గా అదిరిపోయింది.ఈసారి కూడా బ్లాక్ బస్టర్ ఖాయం అనేలా ఉంది.
అలాగే ఇందులో సూర్యతో పాటు దుల్కర్ సల్మాన్, నజ్రియా ఫహద్ లు నటిస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు.ఇంకా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నట్టు తెలిపారు.
ఇక ఈ సినిమా జివి ప్రకాష్ కు 100వ ప్రాజెక్ట్ కావడం విశేషం.చూడాలి ఈ మూవీ ఎప్పుడు రెగ్యురల్ షూట్ స్టార్ట్ అవుతుందో.







