అనాధ పిల్లలను దత్తత తీసుకొని... మనసు చాటుకున్న ఢీ కొరియోగ్రాఫర్ మణికంఠ గ్రేట్ అంటూ?

ఢీ డాన్స్ షో( Dhee Dance Show ) తో ఎంతోమంది కళాకారులు తమ టాలెంట్ ని బయటపెట్టి ఇటు పరిశ్రమలో అవకాశాలు, అటు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు.ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కొరియోగ్రాఫర్లు బయట కూడా ఎంతో మందికి సహాయ సహకారాలు చేస్తూ తమ మంచి మనసు చాటుకున్నారు ఈ క్రమంలోనే కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మణికంఠ ( Manikanta ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 Dhee Dance Coreographer Manikanta Helping Poor And Orphan Kids, Manikanta, Dhee-TeluguStop.com

లారెన్స్( Lawrence ).ను ఎంతో అభిమానిస్తారు ఆయనకు ఏకలవ్య శిష్యుడిగా తనని ఆరాధిస్తూ ఉంటారు.

రాఘవ లారెన్స్ కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ సేవాగుణంలో కూడా ముందు వరుసలో ఉంటారనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తన గురువు గారిని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి మనికంట తను కూడా అనాధ పిల్లలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు.విజయనగరం జిల్లాలోని భోగాపురం గ్రామంలో ఒక డాన్స్ ప్రోగ్రాంకి వెళ్లారు.అక్కడ నృత్య ప్రదర్శన ఇచ్చిన తరువాత మణికంఠ అక్కడి గ్రామా ప్రజలకి ఒక సందేశం ఇచ్చాడు.

మీ గ్రామంలో ఎవరైనా అనాథ పిల్లలు, పేదరికరం వలన చదువుకోలేని పిల్లలు, లేదా డబ్బులేక ఇబ్బంది పడే వారు ఉంటే నాకు తెలియచేయండి వారికి నేను అండగా నిలుస్తానని తెలిపారు.

ఇలా మణికంఠ పేదలకు సహాయం చేయడం ఇది మొదటిసారి కాదు తన సంపాదనలో 20% పేదలకు ఖర్చు చేస్తున్నారూ.అలాగే అవసరమైన వారు తనని సంప్రదించాలి అంటూ తన కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం విశేషం.డాన్స్ విషయంలో లారెన్స్ ను అనుసరించడమే కాకుండా పేదలకు సహాయం చేయడం కూడా ఆయన నుంచి అలవాటు చేసుకుని ఇలా ఎందరికో సహాయం చేస్తున్నటువంటి మణికంఠ మంచి తనం పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube