కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.చిక్ బళ్లాపూర్ లో ఆగి ఉన్న లారీని టాటా సుమో ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో 13 మంది మృత్యువాత పడ్డారు.
మృతులంతా తెలుగువారని తెలుస్తోంది.
ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు.ప్రమాదం జరిగిన సమయంలో టాటా సుమోలో పద్నాలుగు మంది ఉండగా వీరిలో పదమూడు మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.కాగా పండుగకు సొంత ఊళ్లకు వచ్చిన వీరంతా కూలి పనుల కోసం బెంగళూరు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.
దట్టమైన పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







