బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా( Urvashi Rautela ) .బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసినప్పటికీ అంతగా గుర్తింపు మాత్రం సంపాదించలేకపోయారు.
ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈమెకు గుర్తింపు రాకపోవడంతో తిరిగి సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేస్తూ భారీ స్థాయిలో గుర్తింపు పొందారు.ఈ మధ్యకాలంలో ఊర్వశి పెద్ద ఎత్తున సౌత్ సినిమాలలో స్పెషల్ సాంగ్స్( Special Songs ) చేస్తూ సందడి చేస్తున్నారు.
సౌత్ సినిమాలు అంటే తప్పకుండా ఒక స్పెషల్ సాంగ్ దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ స్పెషల్ సాంగ్స్ చేయడం కోసం ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెలెబ్రెటీలను తీసుకోవడానికి దర్శకనిర్మాతలు ఇష్టపడుతున్నారు.ఈ క్రమంలోనే ఊర్వశి పెద్ద ఎత్తున సౌత్ సినిమాలలోని హీరోల పక్కన స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశాలు అందుకుంటున్నారు.ఐదు నిమిషాల పాటలో తళుక్కుమంటే ఈమెకు ఏకంగా రెండు నుంచి మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందిస్తున్నారు.
ఇలా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి ఊర్వశి రౌటేలా ఆస్తులు విలువ తెలిస్తే మాత్రం దిమ్మ తిరగాల్సిందే.

ఈమె హీరోయిన్ గా నటించినది కేవలం కొన్ని సినిమాలు అయినప్పటికీ ఈమె ఆస్తులు విలువ ఏకంగా 300 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.ఇలా కొన్ని సినిమాలలో నటించిన ఈమె ఈ స్థాయిలో ఆస్తులు కూడా పెట్టడానికి చాలా లగ్జరీ లైఫ్ గడపడానికి కారణం లేకపోలేదు.ఈమె ఈ స్థాయిలో ఆస్తులు కూడా పెట్టారు అంటే దుబాయ్ షేక్స్ తో కలిసి ఈమె చేసే పని కారణమని తెలుస్తుంది.
ఇక ఊర్వశి అందాల పోటీలలో పార్టిసిపేట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఇలా అందాల పోటీలలో పార్టిసిపేట్ చేసే వారికి యూకే, కెనడా, దుబాయ్ వంటి దేశాల్లో మంచి క్రేజ్ ఉంటుందట.
అక్కడ ఉండే షేక్స్ కి ఇలాంటి అందాల పోటీలలో చేసే అమ్మాయిలు అంటే చాలా ఇష్టం.

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే సౌత్ ఇండస్ట్రీలో వాల్తేరు వీరయ్య, ఏజెంట్, స్కంద( Skanda ) వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించి మెప్పించారు.






