కూరగాయల సాగు నారుమడుల పెంపక విధానంలో మెళుకువలు..!

కూరగాయల సాగు( Vegetable Cultivation )లో విత్తన పరిమాణం చిన్నగా ఉండే టమాటా, క్యాబేజీ, కాలీఫ్లవర్, మిరప, వంగ, ఉల్లి లాంటి పంటలు సాగు చేయాలనుకుంటే నారును పెంచుకొని, ఆ నారును ప్రధాన పొలంలో నాటుకొని సాగు చేస్తారు.కాబట్టి ఈ పంటలలో అధిక దిగుబడి సాధించడంలో నారుమడులలో నారు పెంచే విధానం కూడా కీలకమే.

 Techniques In The Method Of Cultivation Of Vegetable Cultivation , Vegetable Cu-TeluguStop.com

ఎటువంటి తెగుళ్లు లేని, ఆరోగ్యకరమైన నారును ప్రధాన పొలంలో నాటుకుంటేనే అధిక దిగుబడి సాధించడానికి వీలు ఉంటుంది.అలా కాకుండా తెగుళ్లు సోకిన నాసిరకం నారును ప్రధాన పొలంలో నాటుకుంటే పెట్టుబడి భారం పెరగడంతో పాటు ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించడం కష్టం.

కూరగాయలు సాగు చేసే ముందు నారుమడులలో నారును ఏ విధంగా పెంచాలో తెలుసుకుందాం.నారుమడిలో విత్తనాలు చల్లే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి.విత్తన శుద్ధి చేస్తే భూమి నుంచి సోకే తెగుళ్లు పంటను ఆశించలేవు.పంటకు తెగుళ్లు ఆశించకపోతే పెట్టుబడి భారం తో పాటు శ్రమ తగ్గినట్టే.

కాబట్టి విత్తనాలను సేంద్రీయ పద్ధతి( Organic method )లో కిలో విత్తనాలకు ఐదు గ్రాముల ట్రైకోడెర్మా( Trichoderma ) విరిడి పట్టించి ఆ తర్వాత నారుమడులలో చల్లుకోవాలి.

Telugu Agriculture, Cabbage, Cauliflower, Chili, Eggplant, Organic Method, Tomat

నారు మడులు పెంచే స్థలం ఏ విధంగా ఉండాలంటే.సూర్యరశ్మి, గాలి ధారాళంగా ఉండి, నీటి వసతి దగ్గరగా ఉండాలి.నేలను రెండు లేదా మూడుసార్లు లోతుగా దున్నుకొని చదును చేసుకోవాలి.

నారుమడి పొడవు 4 మీటర్లు, వెడల్పు ఒక మీటరు, ఎత్తు 15 సెంటీమీటర్లు ఉండేటట్లు అవసరం అయినా నారుమడులను తయారు చేసుకోవచ్చు.ఒక ఎకరం పంటకు 40 చదరపు మీటర్ల స్థలంలో పెంచిన నారు సరిపోతుంది.

వేసవికాలంలో నారుమళ్ళపై తెల్లటి పాలిథిన్ కాగితంతో రెండు వారాలపాటు కప్పి ఉంచితే నేలలో ఉండే శిలీంద్రాలు చాలావరకు చనిపోతాయి.

Telugu Agriculture, Cabbage, Cauliflower, Chili, Eggplant, Organic Method, Tomat

ఎరువుల విషయానికి వస్తే.40 చదరపు మీటర్ల నారుమడికి 40 కిలోల పశువుల ఎరువు, రెండు కిలోల అజటోబాక్టర్ అవసరం.విత్తనాలను నారుమడిలో పలుచగా చల్లితే సూర్యరశ్మి, గాలి బాగా తగిలి ఆరోగ్యకరంగా పెరుగుతాయి.

ఆరోగ్యకరమైన ఐదు వారాల వయసు ఉండే నారు ప్రధాన పొలంలో నాటుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube