కూరగాయల సాగు నారుమడుల పెంపక విధానంలో మెళుకువలు..!

కూరగాయల సాగు( Vegetable Cultivation )లో విత్తన పరిమాణం చిన్నగా ఉండే టమాటా, క్యాబేజీ, కాలీఫ్లవర్, మిరప, వంగ, ఉల్లి లాంటి పంటలు సాగు చేయాలనుకుంటే నారును పెంచుకొని, ఆ నారును ప్రధాన పొలంలో నాటుకొని సాగు చేస్తారు.

కాబట్టి ఈ పంటలలో అధిక దిగుబడి సాధించడంలో నారుమడులలో నారు పెంచే విధానం కూడా కీలకమే.

ఎటువంటి తెగుళ్లు లేని, ఆరోగ్యకరమైన నారును ప్రధాన పొలంలో నాటుకుంటేనే అధిక దిగుబడి సాధించడానికి వీలు ఉంటుంది.

అలా కాకుండా తెగుళ్లు సోకిన నాసిరకం నారును ప్రధాన పొలంలో నాటుకుంటే పెట్టుబడి భారం పెరగడంతో పాటు ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించడం కష్టం.

కూరగాయలు సాగు చేసే ముందు నారుమడులలో నారును ఏ విధంగా పెంచాలో తెలుసుకుందాం.

నారుమడిలో విత్తనాలు చల్లే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి.విత్తన శుద్ధి చేస్తే భూమి నుంచి సోకే తెగుళ్లు పంటను ఆశించలేవు.

పంటకు తెగుళ్లు ఆశించకపోతే పెట్టుబడి భారం తో పాటు శ్రమ తగ్గినట్టే.కాబట్టి విత్తనాలను సేంద్రీయ పద్ధతి( Organic Method )లో కిలో విత్తనాలకు ఐదు గ్రాముల ట్రైకోడెర్మా( Trichoderma ) విరిడి పట్టించి ఆ తర్వాత నారుమడులలో చల్లుకోవాలి.

"""/" / నారు మడులు పెంచే స్థలం ఏ విధంగా ఉండాలంటే.సూర్యరశ్మి, గాలి ధారాళంగా ఉండి, నీటి వసతి దగ్గరగా ఉండాలి.

నేలను రెండు లేదా మూడుసార్లు లోతుగా దున్నుకొని చదును చేసుకోవాలి.నారుమడి పొడవు 4 మీటర్లు, వెడల్పు ఒక మీటరు, ఎత్తు 15 సెంటీమీటర్లు ఉండేటట్లు అవసరం అయినా నారుమడులను తయారు చేసుకోవచ్చు.

ఒక ఎకరం పంటకు 40 చదరపు మీటర్ల స్థలంలో పెంచిన నారు సరిపోతుంది.

వేసవికాలంలో నారుమళ్ళపై తెల్లటి పాలిథిన్ కాగితంతో రెండు వారాలపాటు కప్పి ఉంచితే నేలలో ఉండే శిలీంద్రాలు చాలావరకు చనిపోతాయి.

"""/" / ఎరువుల విషయానికి వస్తే.40 చదరపు మీటర్ల నారుమడికి 40 కిలోల పశువుల ఎరువు, రెండు కిలోల అజటోబాక్టర్ అవసరం.

విత్తనాలను నారుమడిలో పలుచగా చల్లితే సూర్యరశ్మి, గాలి బాగా తగిలి ఆరోగ్యకరంగా పెరుగుతాయి.

ఆరోగ్యకరమైన ఐదు వారాల వయసు ఉండే నారు ప్రధాన పొలంలో నాటుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు.