మాస్ మహారాజ రవితేజ ( Ravi Teja ) మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.తాజాగా ఈయన ఒక బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
దసరా బరిలో ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు మాస్ రాజా వచ్చాడు.రవితేజ చేసిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”టైగర్ నాగేశ్వరరావు”.
నూతన డైరెక్టర్ వంశీ( Director Vamsee ) దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాతో రవితేజ మొదటిసారి పాన్ ఇండియన్ సినిమా చేసాడు.ఈ సినిమా అక్టోబర్ 20న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
దసరాకు భారీ పోటీ ఉన్నప్పటికీ మాస్ రాజా వెనకడుగు వేయకుండా వచ్చాడు.

ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కగా మొదటి రోజు కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకుంది.మరి ఈ సినిమా( Tiger Nageswara Rao ) ఇప్పుడు ఒక విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది.అది ఏంటి అంటే ఈ సినిమా రిలీజ్ రోజు కంటే 5,6 రోజుల్లో భారీ రెస్పాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది.
5, 6 రోజులు అంటే పండుగ రెండు రోజుల్లో ఈ సినిమాకు బుక్ మై షోలో రెస్పాన్స్ బాగా వచ్చిందట.అది కూడా ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా ఈ రేంజ్ లో జంప్ చేయడం మాస్ రాజా ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తుంది.
మరి ఇదే జోరు కంటిన్యూ అయితే ఇది తప్పకుండ విజయం సాధించే అవకాశం ఉంది.

కాగా ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్( Nupur Sanon ), గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించారు.అలాగే జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందించగా లాంగ్ రన్ లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.







