సినిమా పేరును మర్చిపోయిన పవన్ కళ్యాణ్... మంచిదే అంటున్న డైరెక్టర్ హరీష్ శంకర్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో చాలా చురుగ్గా ఉంటున్నారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఇప్పటికే వరుస సినిమాలకు కమిట్ అయ్యారు.

 Director Harish Shankar React On Pawan Kalyan Forgot His Movie Name , Pawan Ka-TeluguStop.com

ఇలా ఒక వైపు సినిమాలలో2 నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో సినిమా షూటింగులు కూడా కాస్త ఆలస్యం అవుతూ వస్తున్నాయి.దీంతో అభిమానులతో పాటు మేకర్స్ కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడు పూర్తి అవుతాయి అనే విషయంపై ఏమాత్రం అవగాహన లేకుండా ఉందని చెప్పాలి.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కనీసం తాను ఏ సినిమాలో చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మర్చిపోయారని తెలుస్తోంది.

Telugu Forgot, Harish Shankar, Og, Pawan Kalyan, Tollywood, Ustadbhagath-Movie

తాజాగా ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ క్రమంలోనే తాను నటిస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్( Ustad Bhagath Singh ) సినిమా గురించే ఈయన మాట్లాడుతూ ఈ సినిమా పేరును మరిచిపోయారు.

ఈ సినిమా పేరుకు బదులు సర్దార్ భగత్ సింగ్ అని మాట్లాడారు.దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది కనీసం సినిమా పేరు కూడా తెలియకుండా సినిమాలలో నటిస్తున్నారా అంటూ భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.

Telugu Forgot, Harish Shankar, Og, Pawan Kalyan, Tollywood, Ustadbhagath-Movie

ఇలా ఈ సినిమా పేరును తప్పుగా పలకడంతో సినీ దర్శకుడు హరీష్ శంకర్ ( Harish Shankar ) సోషల్ మీడియా వేదికగా స్పందించారు.ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు పేరు తప్పుగా పలకడమే మంచిదైంది.ఎందుకంటే ఆయన సరిగా పలికి ఉంటే కనుక ఈ సినిమా పేరు ఇంత వైరల్ అయ్యేది కాదు కదా ఇప్పుడు మా సినిమాకు ఎంతో మంచి పబ్లిసిటీ లభించింది ఏం జరిగినా మంచిదే హ్యాపీ దసరా అంటూ ఈయన పవన్ కళ్యాణ్ సినిమా పేరు తప్పుగా పలకడం పై స్పందించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఎన్నో అంచనాల నడుమ హరీష్ పవన్ కాంబినేషన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube