కరోనా తర్వాత ప్రపంచంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి.ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయ.
ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ కి సినిమా ధియేటర్ కేరాఫ్ అడ్రస్ గా ఉండేది.కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థలు వచ్చాక.
పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి.ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు సినిమా ధియేటర్ కంటే ఎక్కువగా ఓటీటీ లకు అలవాటు పడటం జరిగింది.
దీంతో కొత్త సినిమా థియేటర్ లో నెలరోజులు సందడి చేస్తే తర్వాత వెంటనే ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో దర్శనమిస్తున్నాయి.కొన్ని సినిమాలయితే ఏకంగా డైరెక్ట్ గా ఓటీటీ లలో విడుదల చేస్తున్నారు.
ఈ పరిస్థితిలలో సినిమా నిర్మించే నిర్మాతలు అనేక కష్టాలు పడుతున్నారు.
ఈ క్రమంలో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Errabelli dayakar Rao )సినిమా రంగంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు సినిమాలు థియేటర్లలోనే చూడాలని పిలుపునిచ్చారు.సినిమా నిర్మాణం ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.అని అన్నారు.తొర్రురులో ఓ సినిమా థియేటర్ ని ప్రారంభించడం జరిగింది.
థియేటర్ ప్రారంభించిన అనంతరం ఓ సినిమాని వీక్షించారు.సినిమాను థియేటర్లలో చూస్తే ఆ ఆనందమే వేరని అన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్CM kcr ) సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారని చెప్పుకొచ్చారు.