కుర్చీల కోసం పార్టీ మారే వ్యక్తి రేవంత్ రెడ్డి..: మంత్రి హరీశ్ రావు

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.రేవంత్ రెడ్డి పూటకో పార్టీ మారతారన్న మంత్రి హరీశ్ రావు కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు.

 Revanth Reddy Is A Party Changer For Chairs..: Minister Harish Rao-TeluguStop.com

గతంలో సోనియాగాంధీని బలి దేవత అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు సోనియాను దేవత అంటున్నారని హరీశ్ రావు తెలిపారు.ఏ ఎండకి ఆ గొడుకు పట్టే రకం రేవంత్ రెడ్డి అని విమర్శించారు.

బీజేపీపై పోరాడే డీఎన్ఏ తనదని రాహుల్ అంటున్నారు.మరి రేవంత్ రెడ్డి డీఎన్ఏ ఏదో రాహుల్ తెలుసుకోవాలని సూచించారు.

రాహుల్, రేవంత్ రెడ్డి డీఎన్ఏలు మ్యాచ్ కావడం లేదని విమర్శించారు.తాము ఎవ్వరికీ బీ టీం కాదన్న మంత్రి హరీశ్ రావు తాము తెలంగాణ ప్రజల టీమ్ అని స్పష్టం చేశారు.

కేసీఆర్ తలుచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైల్లో వేసేవారన్నారు.కానీ కేసీఆర్ కు పనితనం తప్ప పగతనం తెలియదని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube