పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ( Janasena Party ) స్థాపించి రాజకీయాలలోకి కూడా వచ్చిన సంగతి మనకు తెలిసిందే ఇలా ఈయన ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో పవన్ కళ్యాణ్ తన పార్టీని తెలుగు దేశం పార్టీతో పొత్తు కుదుర్చుకొని ఎన్నికల బరిలోకి రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈయన ఎన్నికలలో బిజీ అయ్యారు.ఇలా రాజకీయాల పరంగా సిరిమాలపరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా మహా న్యూస్ ఛానల్(Mahaa Max ) కి సంబంధించి మహా మ్యాక్స్ (Maha Max) అనే పేరుతో కొత్తగా ఎంటర్టైర్మెంట్ ఛానల్ ప్రారంభించారు.

ఈ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వార్తలను న్యూస్ ఛానల్ లోనే కేవలం ఒక బుల్లెట్ ద్వారా మాత్రమే చూపించేవారు కానీ సినిమా కంటూ ఏ ఒక్క ఛానల్ కూడా లేదు ఇలా మహా చానల్ మొదటిసారి సినిమా కోసమే ఛానల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.

ఇక చాలామంది టీవీ ఛానల్ రేటింగ్ కోసం రాజకీయాలలోకి సినిమా వాళ్ళను లాగుతున్నారని ఈయన తెలియజేశారు.దయచేసి సినిమా వాళ్ళను రాజకీయాలలోకి లాగొద్దని, సినిమా వాళ్ళవి చాలా సున్నితమైన మనస్తత్వాలు అవసరమైతే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను తెలియజేయండి కానీ వారినే రాజకీయాలలోకి లాగీ వారిని ఇబ్బంది పెట్టద్దని పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు.ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు అరెస్టు( Chandrababu Naidu arrest ) గురించి సినిమా ఇండస్ట్రీ మౌనంగా ఉంది అంటూ పెద్ద ఎత్తున న్యూస్ ఛానల్స్ వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి గురించి మాట్లాడారు కేవలం మీ చానల్స్ రేటింగ్ కోసమే ఇలా వారిని ఇబ్బంది పెడుతున్నారని దయచేసి ఇబ్బంది పెట్టొద్దు అంటూ ఈ సందర్భంగా పవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక తాను హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్( Ustad Bhagath Singh) సినిమా పేరు పలకడం మర్చిపోయినటువంటి పవన్ సర్దార్ భగత్ సింగ్ అంటూ సినిమా పేరు చెప్పి తడబడ్డారు.ఇలా పవన్ కళ్యాణ్ తాను నటిస్తున్న సినిమా పేర్లను కూడా మర్చిపోవడంతో అభిమానులు షాక్ అయ్యారు.







