దసరా పండుగ సందర్భంగా చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా థియేటర్ లో సందడి చేశాయి.ఇప్పటి లాగే వచ్చే నెల అనగా అక్టోబరు చివరి వారంలో మళ్లీ చిన్న సినిమాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి.
మరి అక్టోబర్ చివరి వారంలో విడుదల కాబోతున్న సినిమాలు వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే.సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం మార్టిన్ లూథర్ కింగ్( Martin Luther King ).పూజ కొల్లూరు దర్శకత్వం వహించింది.కాగా తమిళంలో ఘన విజయం సాధించిన మండేలా చిత్రానికి రీమేక్ ఇది.పొలిటికల్ సెటైరికల్ మూవీగా రూపొందిన ఈ సినిమా అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే దేశభక్తి, తెగువ ఉన్న యుద్ధ విమాన పైలట్ తేజస్ గిల్( Tejas Gill ).కంగనా రనౌత్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఆ చిత్రమే తేజస్.సర్వేశ్ మేవారా దర్శకత్వం వహించారు.
భారతీయ వైమానిక దళం పాకిస్థాన్‌లో చేపట్టే ఒక రహస్య ఆపరేషన్‌లో పాల్గొనే పైలట్‌గా కనిపించనుంది కంగాన.రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 27న థియేటర్ లో విడుదల కానుంది.
కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ఘోస్ట్( Ghost ).శ్రీని దర్శకుడు.సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు.దసరా కానుకగా కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్టోబరు 27న తెలుగులోనూ రానుంది.అలాగే హృతిక్ శౌర్య, తన్వి నేగి జంటగా రవి తెరకెక్కించిన చిత్రం ఓటు చాలా విలువైనది.అన్నది ఉపశీర్షిక.
ఫ్లిక్ నైన్ స్టూడియోస్ సంస్థ నిర్మించింది.గోపరాజు రమణ కీలక పాత్ర పోషించారు.
ఈ సినిమా కూడా అక్టోబరు 27న విడుదల కానుంది.ఇకపోతే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు, సిరీస్‌ల విషయానికి వస్తే.
నెట్‌ఫ్లిక్స్ లో లైఫ్ ఆన్ ఔర్ ప్లానెట్ అనే డాక్యుమెంటరీ సిరీస్ అక్టోబరు 25 విడుదల కానుంది.అదేవిధంగా చంద్రముఖి 2( Chandramukhi 2 ) మూవీ తమిళ్, తెలుగు భాషల్లో అక్టోబరు 26 న విడుదల కానుంది.
అలాగే పెయిన్ హజ్లర్స్ హాలీవుడ్ మూవీ అక్టోబరు 27 ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపోతే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యే సినిమాలు వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే.ఆస్పిరెంట్స్ అనే హిందీ సిరీస్2 అక్టోబరు 25 న విడుదల కానుంది.ట్రాన్స్‌ఫార్మార్స్ అనే హాలీవుడ్ మూవీ అక్టోబరు 26 ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాన్‌సిక్రేషన్ అనే హాలీవుడ్ మూవీ అక్టోబరు 27 న విడుదల కానుంది.కాస్టావే దివా అనే కొరియన్ మూవీ అక్టోబరు 28 న విడుదల కానుంది.
అలాగే జీ5 దురంగా అనే వెబ్‌సిరీస్2 అక్టోబరు 24 న విడుదల కానుంది.అలాగే డిస్నీ+హాట్‌స్టార్ మాస్టర్ పీస్ అనే మూవీ మలయాళం,తెలుగు లో అక్టోబరు 24 న విడుదల కానుంది.
రామ్ పోతినేని నటించిన స్కంద మూవీ అక్టోబరు 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.








