వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై పోటీ చేసేందుకు కామారెడ్డి జిల్లా మాస్టర్ ప్లాన్ రైతులు సిద్ధం అయ్యారు.ఈ మేరకు వంద మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయాలని తీర్మానం చేశారు.
ఈ క్రమంలో ప్రతి గ్రామం నుంచి 15 మంది చొప్పున కేసీఆర్ పై మొత్తం వంద నామినేషన్లు వేయనున్నారు.కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో రైతు ఐక్యకార్యాచరణ కమిటీ భేటీ జరిగింది.
ఆయా గ్రామాల రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు.ఈ క్రమంలోనే తమ భూములను కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తామని రైతులు తేల్చి చెప్పారు.
మాస్టర్ ప్లాన్ రద్దు చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.మాస్టర్ ప్లాన్ రద్దు చేసిన తరువాతే కేసీఆర్ కామారెడ్డికి రావాలని చెబుతున్నారు.







