తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss 7 ) రసవత్తరంగా సాగుతోంది.ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ప్రసారం అవుతున్న ఈ షోలో ఎన్నో ఊహించని సంఘటనలు ఎదురవుతున్నాయి.
అయితే, నామినేషన్స్ ప్రక్రియ మాత్రం గత సీజన్ లలో మాదిరిగానే ఫుల్లు ఫైర్‌తో సాగుతోంది.తాజాగా 8వ వారంలో గౌతమ్ కృష్ణ తీసిన పాయింట్లకు ప్రశాంత్, భోలే షావలి దిమ్మ తిరిగిపోయింది.
ఎనిమిదో వారం ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.తాజాగా ప్రసారం అయిన ఎపిసోడ్‌లో ప్రతి కంటెస్టెంట్ తాను నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు ఫొటోలను మంటల్లో కాల్చి అందుకు తగిన కారణం చెప్పాల్సి ఉంటుంది.

కాగా 8వ వారం నామినేషన్స్( Bigg Boss 8th Week Nominations ) టాస్కులో భాగంగా అందరి కంటే గౌతమ్ కృష్ణ నామినేట్ చేసే సమయంలో చెప్పిన పాయింట్స్ ఆలోచింపజేశాయి.ముందుగా అతడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేస్తున్నప్పుడు సందీప్ మాస్టర్ విషయంలో నువ్వు మాట మార్చడం, అది అడిగిన నాగార్జున సార్ ముందు డిఫెండ్ చేసుకోలేకపోవడం నచ్చలేదు అని రీజన్ చెప్పాడు. గౌతమ్ కృష్ణ( Gautham Krishna ) చెప్పిన పాయింట్‌లో నిజం ఉండడంతో పల్లవి ప్రశాంత్ బదులు ఇవ్వలేకపోయాడు.

అయితే అది అయిపోయిన మేటర్.సందీప్ మాస్టర్‌కు ఎప్పుడో సారీ చెప్పా అంటూనే అపరిచితుడిలా మారిపోయాడు.ఎప్పటిలాగే తన మేనరిజం చూపిస్తూ గౌతమ్‌తో వాదనకు దిగాడు.
కానీ డాక్టర్ బాబు మాత్రం ఎంతో కూల్‌గా నిల్చుని ప్రశాంత్( Pallavi Prashanth )కు సమాధానాలు చెప్పాడు.తనతో వాదనకు దిగిన ప్రశాంత్‌తో గౌతమ్ కృష్ణ నువ్వు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు.
మరి నాగార్జున( Nagarjuna ) సార్ అడిగినప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నావు? ఎందుకు ఏడ్చావు? అదంతా యాక్టింగా? అంటూ వరుస ప్రశ్నలతో ఇచ్చిపడేశాడు.అప్పుడు ప్రశాంత్ యాక్టింగ్ చేస్తుంటే.
గౌతమ్ నువ్వు నటించకు నేనేమీ ఆడిషన్స్ తీసుకోవట్లేదు అంటూ షాక్ ఇచ్చాడు.మొత్తానికి గౌతమ్ కృష్ణ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నోరు మూయించడంతోపాటు గట్టిగానే కౌంటర్లు ఇచ్చాడు.







