వీడియో: రోడ్డుపై కనిపించిన పేద మహిళకు నోట్ల కట్ట ఇచ్చిన అమెరికన్ యూట్యూబర్..

చాలా మంది యూట్యూబర్లు( Youtubers ) గొప్ప దానాలు చేస్తూ ఇప్పటికే ఎంతోమంది హృదయాలను గెలిచేశారు.ఉదాహరణకు హర్ష సాయి.

 Viral Video American Youtuber Ishowspeed Give Notes Bundles To A Poor Woman In I-TeluguStop.com

అతను ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.హర్ష సాయి ఒక్కడే కాదు ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబర్లు నిరుపేదలకు డబ్బులు పంచి పెడుతూ వారి కష్టాలను తీరుస్తున్నారు.

ఇటీవల ఒక అమెరికన్ యూట్యూబర్( American Youtuber ) ఇండియాను సందర్శించినప్పుడు కూడా అదే పని చేశాడు.అతను నిరుపేద మహిళకు డబ్బు ఇవ్వడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మీమ్స్ ఫన్నీ వీడియోలు షేర్ చేసే @sarcasticschool_ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ దీనిని పంచుకుంది.

ఈ పాపులర్ యూట్యూబర్‌ ‘IShowSpeed’ అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు.2 కోట్ల 11 లక్షల సబ్‌స్క్రైబర్లు ఇతడికి ఉన్నారు.రెండు రోజుల కింద ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌( ICC Cricket World Cup ) మ్యాచ్ చూసేందుకు ఇండియాలో పర్యటించాడు.

దానికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఖాతాలో “మై లైఫ్ ఇన్” ఇండియా పేరుతో పంచుకున్నాడు.ఆ వీడియో చివరిలో నిరుపేద మహిళను( Poor Woman ) చూసి చలించిపోయాడు.

ఆమెకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు.ఆమె వారిని పెంచుతూ చాలా కష్టపడుతుందని గ్రహించాడు.

అందుకే ఆమెకు తన వంతుగా సహాయం చేయాలనుకున్నాడు. రూ.500 నోట్ల కట్టను ఆమె చేతికి అందించాడు.ఆ డబ్బులు ఎంతో తెలపలేదు కానీ అవి కనీసం రూ.5 లక్షలకు పైగానే ఉంటాయని తెలుస్తోంది.

అతను మొదట ఆ స్త్రీతో మాట్లాడి, ఆ తర్వాత నోట్ల కట్టను తీసి ఆమెకు అందజేస్తాడు.ఈ డబ్బు తీసుకోమని ఆ మహిళకు చెప్పాడు.అతను ఆమెకు డబ్బు ఇవ్వగానే, ఆ మహిళ పెద్దగా ఏడవడం ప్రారంభించింది.అప్పుడు అతను ఏడవ వద్దని కోరాడు.ఈ వీడియోకు 80 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి, చాలా మంది వ్యక్తులు యూట్యూబర్‌ను తెగ పొగిడేశారు.ఈ వ్యక్తి నా గౌరవాన్ని పొందాడని ఒకరు అన్నారు.ఈ వ్యక్తికి తాను అభిమానిగా మారానని ఇంకొకరు చెప్పారు.

డబ్బుతో మహిళ కుటుంబానికి మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నట్లు ఒకరు తెలిపారు.ఈ వ్యక్తి చాలా దయగలవాడని ఒకరు చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube