కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో అమానుష ఘటన చోటు చేసుకుంది.దొంగతనం చేసిందని ఆరోపిస్తూ ఇళ్లల్లో పని చేసుకుని జీవనం సాగించే ఓ గిరిజన యువతిపై యజమాని దాడికి పాల్పడ్డాడు.
ఈ దారుణ ఘటన కే.కొత్తపాలెం గ్రామంలో జరిగింది.బాధితురాలి బంధువులైన మరో ఇద్దరిని ఇంటికి పిలిపించి వారిపై కూడా దొంగతనం నేరాన్ని మోపేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే రెండు రోజుల పాటు వారిని ఇంటిలోనే నిర్బంధించి దాడి చేసినట్లు బాధితురాలు వాపోయింది.
యాజమాని దాడిలో తీవ్రగాయాలపాలైన బాధితురాలు మోపిదేవి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.అయితే తమ గోడును పట్టించుకోని మోపిదేవి ఎస్ఐ తిరిగి తమపైనే దాడి చేసినట్లు ఆరోపించారు.
ప్రస్తుతం బాధితులు అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.







