అసలు నువ్వు ఆడటానికి బిగ్ బాస్ వచ్చావా... గీతూ ప్రశ్నకు దండం పెట్టిన పూజ!

బిగ్ బాస్ ( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమం 7 వారాలను పూర్తి చేసుకుంది.ఈ కార్యక్రమంలో భాగంగా ఏడవ వారం కూడా మరొక లేడీ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వచ్చారు.

 Bigg Boss Telugu 7 Buzz Geethu Royal Ask Shocking Question To Pooja Murthy , Poo-TeluguStop.com

వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఐదవ వారం హౌస్ లోకి వెళ్లినటువంటి పూజ మూర్తి ( Pooja Murthy ) రెండు వారాలపాటు హౌస్ లో కొనసాగి ఏడవ వారం హౌస్ నుంచి బయటకు వచ్చేసారు.ఇలా ఊహించని విధంగా పూజ మూర్తి రెండవ వారం ఎలిమినేట్ కావడంతో ఆమె కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు.

ఇలా ఏడవ వారంలో పూజ మూర్తిని హౌస్ నుంచి బయటకు పంపించి మరొక కంటెస్టెంట్ రతికను హౌస్ లోకి పంపించేశారు.

Telugu Bigg Boss Buzz, Geethu Royal, Pooja Murthy, Telugu-Movie

ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినటువంటి పూజ మూర్తి అనంతరం గీతు రాయల్( Geethu Royal ) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి బిగ్ బాస్ బజ్ ( Bigg Boss Buzz ) కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా గీతు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ల గురించి ఎన్నో ప్రశ్నలు అడగగా ఆమె తనకు తోచిన సమాధానాలను హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల పట్ల తన అభిప్రాయాలను తెలియజేశారు.

ఇక పూజ మూర్తి మాట్లాడుతూ.హౌస్ లో ఉన్న కొంతమంది గేమ్ ఆడకుండానే ఎలాగలాగో నెట్టుకొస్తున్నారు అంటూ చెప్పింది ఇంతలోపు గీత ఈమెను ప్రశ్నిస్తూ.

Telugu Bigg Boss Buzz, Geethu Royal, Pooja Murthy, Telugu-Movie

మీరు హౌస్ లోకి గేమ్ ఆడటానికి వచ్చారా లేక వారందరినీ ఎంకరేజ్ చేయడానికి వచ్చారా అంటూ ప్రశ్నించారు.తాను గైడ్ చేశానని అది కూడా గేమే అంటూ పూజ సమాధానం చెప్పారు.ఈమె ఇలా సమాధానం చెప్పడంతో గీతు వెంటనే మాట్లాడుతూ అంతిమ విజయం ఎప్పుడూ ఆటగాడిదే అవుతుంది కానీ కోచ్ ది కాదు అంటూ కౌంటర్ ఇవ్వడంతో ఒక్కసారిగా పూజ మూర్తి గీతు రాయల్ కు దండం పెట్టేసారు.అయితే ఈమె విషయంలో గీతు చెప్పినది వాస్తవమేనని ఎప్పుడూ కూడా ఆట ఆడే వాళ్లే గెలుస్తారు కానీ వారిని గైడ్ చేసే వాళ్ళు గెలవరు అందుకే ఈమె బయటకు వచ్చారు అంటూ కొందరు గీతు వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube