వచ్చే అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( CM Jagan ) పూర్తిగా దృష్టి సారించారు .వచ్చే ఎన్నికల్లో ఏ ఏ నియోజకవర్గాల నుంచి ఎవరిని అభ్యర్థులుగా నియమించాలనే విషయంపై చాలా రోజులుగా కసరత్తు చేస్తూనే ఉన్నారు.
అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనే చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారట.ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తున్న నేపథ్యంలో, స్వయంగా జగన్ అభ్యర్థులు ఎంపిక చేపట్టారు.
దీంట్లో సీనియర్ మంత్రులు, పార్టీ కీలక నాయకులు, ఆర్థిక అంగ బలం ఉన్న నేతలను ఎంపీ అభ్యర్థులుగా ఎంపిక చేసే ప్రక్రియకు జగన్ శ్రీకారం చుట్టారట .ఒకేసారి అసెంబ్లీ , లోక్ సభ అభ్యర్థులను ఖరారు చేసే పబిలో నిమగ్నమయ్యారు.ఏపీలో 175 నియోజకవర్గాల్లోనూ గెలవాలనే నినాదాలు వినిపిస్తున్న జగన్ దానికి అనుగుణంగానే అభ్యర్థుల ఎంపికపై ముందుగానే అలర్ట్ అవుతున్నారు.
కొంతమందికి సీట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో మరో అవకాశం కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు .అలాగే వారసుల విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు .కొంతమంది ఎంపీలను, ఎమ్మెల్యేలు గా, కొంతమంది మంత్రులు, సీనియర్లను ఎంపీలుగా పోటీ చేయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ను( MP Margani Bharat ) నిడదవోలు ఎమ్మెల్యేగా పోటీకి దించాలని చూస్తున్నారట. అలాగే రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కురసాల కన్నబాబు పేరు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం.
అలాగే వంగా గీత( Vanga Geeta ) మరోసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దింపుతారట. ఇక కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్ పేరు వినిపిస్తోంది.

ఏలూరు ఎంపీ అభ్యర్థిని మార్చే ఆలోచనలో జగన్ ఉన్నారట. వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో బోళ్ళ రాజీవ్( Bolla Rajiv ) పేరు పరిశీలనలో ఉందట .నరసాపురం నుంచి దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలను( Shyamala ) పోటీకి దింపే ఆలోచనలు ఉన్నారట.ఈ మేరకు ఎంపీ మిధున్ రెడ్డి సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.
శ్యామల పోటీకి ఆసక్తి చూపించకపోతే గోకరాజు రామరాజు పేరు పరిశీలిస్తున్నారట .గుంటూరు, విజయవాడ లోక్ సభ స్థానాలపైనా దృష్టి పెట్టారు.ఇక నరసరావుపేట నుంచి అయోధ్య రామిరెడ్డి( Ayodhya Ramireddy ) పోటీ చేసే అవకాశం ఉందట.ఒంగోలు నుంచి కరణం బలరాం, అనంతపురం నుంచి ఎంపీగా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి , హిందూపురం నుంచి ఎమ్మెల్సీ ఇక్బాల్ ను ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కర్నూలు ఎంపీగా టిడిపి సీనియర్ నేత కుటుంబం వైసీపీలోకి వస్తుండడంతో వారికి కేటాయించబోతున్నట్లు సమాచారం.అలాగే బుట్ట రేణుక( Butta Renuka ) పేరు కూడా పరిశీలనలో ఉంది.నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి( Vemireddy Prabhakar Reddy ) పేరు ఇప్పటికే ఖరారు అయింది.తిరుపతి, కడప, నంద్యాల, రాజంపేట, మచిలీపట్నం ఎంపీ స్థానాల్లో మార్పులు లేవట.
శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా మంత్రి ధర్మాన , తమ్మినేని సీతారాం పేర్లు పరిశీలనలో ఉన్నాయట. విజయనగరం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ లేదా ఆమె సతీమణి ఝాన్సి పోటీ చేసే అవకాశం ఉందట .అనకాపల్లి నుంచి మాజీ ఎంపీ అవంతి శ్రీనివాస్ పేరు ను పరిశీలిస్తున్నారట.







